Andhra Pradesh: ‘500 నోట్లు ఇస్తే కోటి రూపాయలిస్తాం’.. దందాకు పోలీస్ ఉన్నతాధికారి నాయకత్వం..!
మీరు 500 నోట్లు 90 లక్షలు ఇవ్వండి చాలు.. మేము రెండు వేల రూపాయల నోట్లు కోటి ఇస్తాం.. ఇదే ఇప్పుడు విశాఖ బ్లాక్ మార్కెట్‌లో నయా బిజినెస్. ఆ 10 లక్షలకు ఆశ పడితే అంతే సంతగతులు. మన అత్యాశే మోసగాళ్లకు వరంలా మారుతోంది. ఇక ఇలాంటి మోసాలకు చెక్ పెట్టాల్సిన పోలీసులే కన్నింగ్ గ్యాంగ్స్‌ను లీడ్ చేయడం కలకలం రేపుతోంది.
మీరు 500 నోట్లు 90 లక్షలు ఇవ్వండి చాలు.. మేము రెండు వేల రూపాయల నోట్లు కోటి ఇస్తాం.. ఇదే ఇప్పుడు విశాఖ బ్లాక్ మార్కెట్‌లో నయా బిజినెస్. ఆ 10 లక్షలకు ఆశ పడితే అంతే సంతగతులు. మన అత్యాశే మోసగాళ్లకు వరంలా మారుతోంది. ఇక ఇలాంటి మోసాలకు చెక్ పెట్టాల్సిన పోలీసులే కన్నింగ్ గ్యాంగ్స్‌ను లీడ్ చేయడం కలకలం రేపుతోంది.
మోసగాళ్లు, కన్నింగ్ గాళ్లు ఎక్కువైపోయారు. ఈజీ మనీ కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. అమాయకులు, అత్యాశపరులే వారి టార్గెట్. ఎక్కువ డబ్బు ఆశ చూపించి అడ్డంగా దోచేస్తున్నారు. మోసపోయామని బాధితులు తెలుసుకునే లోపే డబ్బుతో ఉడాయిస్తున్నారు. పక్క వాళ్ల దగ్గర డబ్బులు ఉన్నాయి అనే సమాచారం తెలిస్తే చాలు. ఆ డబ్బులను దండుకోవడానికి అనేక మాయోపాయాలు చేస్తున్నారు. రూ.2 వేల నోట్లను వెనక్కి తీసుకుంటున్నట్లు భారతీయ రిజర్వ్ బ్యాంక్ ప్రకటన చేసిన నేపథ్యంలో.. దీనిని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు అన్ని కుయుక్తులు పన్నుతున్నారు. అయితే ఇలాంటి మోసాలను నిర్మూలించాల్సిన పోలీసులే అవినీతికి పాల్పడుతున్నారు. అందినకాడికి దోచుకుంటున్నారు. ఇలాంటి దోపిడీ అధికారుల కారణంగా మొత్తం పోలీస్ వ్యవస్థకే బ్యాడ్ నేమ్ వస్తోంది. తాజాగా వెలుగు చూసిన ఓఘటన అందరిని విస్మయానికి గురి చేస్తోంది.
విశాఖపట్నంలో ఇలాంటి మరో దందా వెలుగులోకి వచ్చింది. 500 రూపాయల నోట్లు రూ. 90 లక్షల ఇస్తే వాటికి బదులుగా కోటి రూపాయల 2000 నోట్లు ఇస్తామంటూ అమాయకుల వద్ద ఊదరగొడుతున్నారు. ఇదే స్కీమ్ పేరుతో ఇద్దరు రిటైర్డ్ నేవల్ ఆఫీసర్లను ఓ గ్యాంగ్ దారుణంగా చీట్ చేసింది. అయితే, ఈ ముఠాకు ఏఆర్ సీఐ స్వర్ణలత నాయకత్వం వహించినట్లు తేలింది. రూ. 90 లక్షల్లో సీఐ స్వర్ణలత రూ. 15 లక్షలు నొక్కేశారని తేల్చారు. సీఐ స్వర్ణలత తన అనుయాయులతో బాధిత వ్యక్తులను బెదిరించి వెనక్కి పంపించేశారు. ఇక ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షురాలిగా ఉన్న స్వర్ణలత తనను ఎవరూ ఏమీ చేయలేరనే ధీమాతో ఇంతటి దుర్మార్గానికి పాల్పడినట్లు తెలుస్తోంది. అయితే, బాధితులైన రిటైర్డ్ నేవల్ ఆఫీసర్స్ కొల్లి శ్రీను, శ్రీధర్ పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న ఉన్నతాదికారులు స్వర్ణలతను అరెస్ట్ చేయాలని ఆదేశించారు.
ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మన అత్యాశే మోసగాళ్లకు వరంలా మారుతోంది. మన దురాశను వారు ఈ విధంగా క్యాష్ చేసుకుంటున్నారు. ఈ తరహా మోసాలపై పోలీసులు ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తూనే ఉన్నారు. మోసగాళ్లతో జాగ్రత్తగా ఉండాలని, తెలియని వ్యక్తులు చెప్పేవి నమ్మి మోసపోవద్దని హెచ్చరిస్తూనే ఉన్నారు. అయినప్పటికీ, అత్యాశతో అమాయక ప్రజలు ఇలాంటి గ్యాంగ్ చేతుల్లో మోసపోయి బాధితులవుతూనే ఉన్నారు. మన అత్యాశ, దురాశ.. కేటుగాళ్లకు పెట్టుబడిగా మారుతోంది. ఈ ఘరానా మోసంలో పోలీస్ డిపార్ట్మెంట్‌కు చెందిన వ్యక్తి ఉండటంతో అమయాక జనం ఆందోళనకు గురవుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..