TDP Vs YCP: లోకేష్ వెర్సస్ అనిల్.. సవాళ్లతో భగ్గుమంటున్న నెల్లూరు పాలిటిక్స్..!

నెల్లూరు గడ్డపై నారా లోకేష్‌ వర్సెస్‌ అనిల్‌ కుమార్‌ కామెంట్స్‌ కాకరేపుతున్నాయి. నెల్లూరు వచ్చాక లోకేష్ ఫోకస్ అంతా మాజీమంత్రి అనిల్ పైనే అన్నట్టుగా ఉంది.

TDP Vs YCP: లోకేష్ వెర్సస్ అనిల్.. సవాళ్లతో భగ్గుమంటున్న నెల్లూరు పాలిటిక్స్..!
Anil Vs Lokesh
Follow us
Ravi Kiran

|

Updated on: Jul 06, 2023 | 9:24 PM

నెల్లూరు గడ్డపై నారా లోకేష్‌ వర్సెస్‌ అనిల్‌ కుమార్‌ కామెంట్స్‌ కాకరేపుతున్నాయి. నెల్లూరు వచ్చాక లోకేష్ ఫోకస్ అంతా మాజీమంత్రి అనిల్ పైనే అన్నట్టుగా ఉంది. ఇక అనిల్ దూకుడు కూడా లోకేష్ మాత్రమే నా టార్గెట్ అన్నట్టుంది. నేతల మధ్య మాటల తూటాలు ఓ రేంజ్‌కి చేరాయి. సవాళ్ళు ప్రతి సవాళ్ళతో సింహపురిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

మాజీ మంత్రి అనిల్‌ వర్సెస్‌ లోకేష్‌ కాంట్రవర్సీ నెల్లూరులో రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. నెల్లూరు నగరంలో జరిగిన యువగళం పాదయాత్ర లో మాజీ మంత్రి అనిల్ టార్గెట్ గా లోకేష్ ఘాటు విమర్శలు చేసారు. నెల్లూరు ప్రజలు నారాయణ ను ఓడించి పాలిచ్చే అవును కాదని తన్నే దున్నపోతుని తెచ్చుకున్నారంటూ అనిల్ ని టార్గెట్ చేశారు. గడిచిన 4 ఏళ్ల 2నెలల్లో అనిల్ వెయ్యి కోట్లు వెనకేసుకున్నాడని ఆరోపించారు.

మనం ఇద్దరం తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గర ప్రమాణం చేద్దామా అంటూ ప్రతి సవాల్‌ విసిరారు మాజీ మంత్రి అనిల్‌. వెయ్యి కాదు 100 కోట్లు ఉన్నా… ప్రమాణం చేద్దాం రమ్మన్నారు అనిల్‌. చెన్నైలో నేను ఓ విల్లాలో అద్దెకు ఉంటున్నానంటూ అద్దె ఇంటి రెంటల్ అగ్రిమెంట్ చూపించిన అనిల్ చర్చకు సిద్ధమా అంటూ ఛాలెంజ్ చేశారు.

మరోవైపు అనిల్‌పై చేసిన అక్రమ సంపాదనకు సంబంధించిన డాక్యుమెంట్లను విడుదల చేశారు నారా లోకేష్. లోకేష్ విడుదల చేసిన డాక్యుమెంట్లపై అనిల్ కుమార్ స్పందించారు. వెయ్యి కోట్ల ఆస్తులన్నారు. ఈ లిస్ట్ లో 2 వందల కోట్ల ఆస్తులు కూడా లేవు.. అవి కూడా నావి కావు.. నాకున్న ఆస్తులు ఇందులో 10 కోట్లు మాత్రమేనన్నారు. అయినా సరే తను ముందుగా చెప్పినట్లు నెల్లూరులోని వెంకటేశ్వరపురం తిరుమలేశుని ఆలయంలో రేపు ఉదయం 10 గంటలకు ప్రమాణం చేస్తానన్నారు మాజీ మంత్రి అనిల్‌. దీంతో నెల్లూరు పాలిటిక్స్‌ ప్రకంపనలు రేపుతున్నాయి.

భారీగా పెరిగిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
భారీగా పెరిగిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
Horoscope Today: వారికి ఉద్యోగంలో పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: వారికి ఉద్యోగంలో పని భారం పెరిగే ఛాన్స్..
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్