Janasena: పవన్ కల్యాణ్ వారాహి యాత్ర రెండో దశ షెడ్యూల్‌ ఖరారు.. నేడు పార్టీ నేతలతో భేటీ..

పవన్ కల్యాణ్ వారాహి యాత్ర రెండో దశ సెడ్యూల్ ఖరారైంది. ఇవాళ పార్టీ నేతలతో పవన్ సుదీర్ఘంగా చర్చించి.. వారాహి యాత్రను సక్సెస్ చేసేందుకు నేతలతో సమాలోచనలు జరపనున్నారు పవన్.

Janasena: పవన్ కల్యాణ్ వారాహి యాత్ర రెండో దశ షెడ్యూల్‌ ఖరారు.. నేడు పార్టీ నేతలతో భేటీ..
Janasena
Follow us
Surya Kala

|

Updated on: Jul 07, 2023 | 6:42 AM

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ చేపట్టిన వారాహి విజయ యాత్ర రెండో ఫేజ్ షెడ్యూల్‌ ఖరారైంది. ఏలూరు నుంచి రెండో విడత యాత్ర చేపట్టాలని పవన్‌ కల్యాణ్‌ నిర్ణయించారు. ఈనెల 9వ తేదీ సాయంత్రం 5గంటలకు ఏలూరులో నిర్వహించే బహిరంగసభతో యాత్ర ప్రారంభమవుతుందని జనసేన పార్టీ నేత పి.హరిప్రసాద్‌ తెలిపారు. వారాహియాత్రి రెండో దశ గురించి చర్చించేందుకు హైదరబాద్ నుంచి గన్నవరం వచ్చిన పవన్.. మంగళగిరి పార్టీ కార్యాలయంలో రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌తో సుదీర్ఘంగా చర్చించారు. ఇవాళ మరోసారి పార్టీ నేతలతో భేటీ అవుతారు పవన్. ఈ భేటీలో ఏలూరుతో పాటు దెందులూరు, తాడేపల్లిగూడెం, ఉంగుటూరు, తణుకు నియోజకవర్గాల నాయకులతో స్థానిక రాజకీయ పరిస్థితులపై పవన్‌ చర్చించనున్నారు.

ఇక పవన్ కల్యాణ్ చేపట్టిన తొలి విడత వారాహి యాత్ర సూపర్ సక్సెస్ అయింది. వారాహి యాత్రకు ప్రజల నుంచి భారీ స్పందన వచ్చింది. ఎక్కడ సభ పెట్టినా.. ఇసుకేస్తే రాలనంతగా ప్రజలు, జనసేన కార్యకర్తలు, పవన్ అభిమానులు తరలివచ్చారు. నిండుగా కనిపించిన పవన్ సభలు అధికార, ప్రతిపక్ష పార్టీల్లో సైతం ఆందోళన కలిగించాయి. అయితే వారాహి తొలి విడత యాత్ర మొత్తం ప్రజా సమస్యలపై.. ప్రభుత్వంపై విమర్శలు చేశారు. అధికార పార్టీ నేతలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో రెండో విడత యాత్రపై జనసేన పార్టీ, ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ దృష్టి సారించారు. పశ్చిమగోదావరి నుంచే యాత్ర కొనసాగించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

హైదరాబాద్ అల్లు ఆర్మీ ఉత్సాహం.! పుష్ప వైల్డ్ ఫైర్ జాతర
హైదరాబాద్ అల్లు ఆర్మీ ఉత్సాహం.! పుష్ప వైల్డ్ ఫైర్ జాతర
ఏడాదిలో ఒక్కసారే దొరికే లడ్డూ.! ఇప్పడు మిస్‌ అయితే మళ్లీ ఏడాదికే!
ఏడాదిలో ఒక్కసారే దొరికే లడ్డూ.! ఇప్పడు మిస్‌ అయితే మళ్లీ ఏడాదికే!
గొంతులో ఏదైనా ఇరుక్కుంటే ఎలా తీయాలి.? నీలోఫర్ వైద్యుల డెమో..
గొంతులో ఏదైనా ఇరుక్కుంటే ఎలా తీయాలి.? నీలోఫర్ వైద్యుల డెమో..
ఇలాంటి స్వీట్స్‌ మీరెప్పుడూ చూసి ఉండరు.! నోరూరిస్తున్న స్వీట్స్‌.
ఇలాంటి స్వీట్స్‌ మీరెప్పుడూ చూసి ఉండరు.! నోరూరిస్తున్న స్వీట్స్‌.
నెల రోజుల పాటు నాన్ వెజ్ మానేస్తే.. శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?
నెల రోజుల పాటు నాన్ వెజ్ మానేస్తే.. శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?
వైకల్యాన్ని ఓడించిన విజయ దీపిక.. టేబుల్ టెన్నిస్‌లో జాతీయ పతకాలు
వైకల్యాన్ని ఓడించిన విజయ దీపిక.. టేబుల్ టెన్నిస్‌లో జాతీయ పతకాలు
అసలే చలికాలం.. కొంపదీసి ఇవి తింటున్నారేమో జాగ్రత్తా.!
అసలే చలికాలం.. కొంపదీసి ఇవి తింటున్నారేమో జాగ్రత్తా.!
బంగాళాఖాతంలో వాయుగుండం.. తమిళనాడు, నెల్లూరులో భారీ వర్షాలు.!
బంగాళాఖాతంలో వాయుగుండం.. తమిళనాడు, నెల్లూరులో భారీ వర్షాలు.!
పాన్ కార్డ్ 2.O.. అసలేంటిది.? మీ కార్డు మళ్లీ మార్చుకోవాలా.?
పాన్ కార్డ్ 2.O.. అసలేంటిది.? మీ కార్డు మళ్లీ మార్చుకోవాలా.?
చల్లని బీరుతో చిల్ అవుదామనుకున్నారు.. తీరా బాటిల్ మూత ఓపెన్ చేయగా
చల్లని బీరుతో చిల్ అవుదామనుకున్నారు.. తీరా బాటిల్ మూత ఓపెన్ చేయగా