విశాఖపట్నంలో అగ్ని ప్రమాదం.. అపార్ట్‌మెంట్‌లో పేలిన గ్యాస్ సిలిండర్..
LPG cylinder explodes: విశాఖపట్నంలో గ్యాస్ సిలిండర్ పేలి ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. వైజాగ్

Lpg Cylinder Explodes Visakhapatnam
LPG cylinder explodes: విశాఖపట్నంలో గ్యాస్ సిలిండర్ పేలి ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. వైజాగ్ నగరం దొండపర్తిలోని చుక్కవారి వీధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. చుక్కవారి వీధిలోని ఒక అపార్ట్‌మెంట్‌లో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ పేలి భారీగా మంటలు చెలరేగాయి. భవనం నుంచి మంటలు వేగంగా వ్యాపిస్తున్నాయి. చుట్టూ మందపాటి పొగ అలుముకుంది. స్థానికులు వెంటనే అప్రమత్తమై అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది ఫైరింజన్ల సాహాయంతో మంటలను ఆర్పేందుకు కష్టపడుతున్నారు. అయితే ఘటన జరిగిన సమయంలో ఎవరూ లేనట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి ప్రాణ, ఆస్తి నష్టంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read:
