AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గుడ్ న్యూస్… అంగన్వాడీ కేంద్రాల్లో ఉద్యోగాల భర్తీ

తెలంగాణలో అంగన్వాడీ కేంద్రాల్లో ఉద్యోగ భర్తీ మొదలైంది. అంగన్వాడీలో ఉద్యోగాలు కోరుకునేవారికి ఇది శుభవార్త. తెలంగాణలో వేర్వేరు జిల్లాలో అంగన్వాడీ పోస్టుల భర్తీ కొనసాగుతోంది. అందులో భాగంగా రంగారెడ్డి జిల్లాలో 232 అంగన్వాడీ పోస్టుల్ని భర్తీ చేయనుంది మహిళా, శిశు సంక్షేమ శాఖ...

గుడ్ న్యూస్... అంగన్వాడీ కేంద్రాల్లో ఉద్యోగాల భర్తీ
Sanjay Kasula
|

Updated on: Sep 07, 2020 | 6:23 PM

Share

తెలంగాణలో అంగన్వాడీ కేంద్రాల్లో ఉద్యోగ భర్తీ మొదలైంది. అంగన్వాడీలో ఉద్యోగాలు కోరుకునేవారికి ఇది శుభవార్త. తెలంగాణలో వేర్వేరు జిల్లాలో అంగన్వాడీ పోస్టుల భర్తీ కొనసాగుతోంది. అందులో భాగంగా రంగారెడ్డి జిల్లాలో 232 అంగన్వాడీ పోస్టుల్ని భర్తీ చేయనుంది మహిళా, శిశు సంక్షేమ శాఖ.

రంగారెడ్డి జిల్లాలోని 7 ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లో ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్లు, అంగన్వాడీ ఆయాలు, మినీ అంగన్వాడీ టీచర్ పోస్టుల్ని భర్తీ చేయనున్నారు. ఆమన్‌గల్, చేవెళ్ల, హయత్‌నగర్, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, శేరిలింగంపల్లి, షాద్‌నగర్ పరిధిలో ఈ ఖాళీలున్నాయి.

ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఏఏ అంగన్వాడీ సెంటర్‌లో ఎన్ని ఖాళీ పోస్టులున్నాయో తెలుసుకునేందుకు, నోటిఫికేషన్‌కు సంబంధించిన ఇతర వివరాల కోసం  wdcw.tg.nic.in వెబ్‌సైట్‌ చూడొచ్చు. స్థానికంగా నివసించేవారు మాత్రమే అంగన్వాడీ పోస్టులకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది కాబట్టి అప్లై చేసేముందు అభ్యర్థులు నివసించే ప్రాంతంలో ఉన్న అంగన్వాడీ సెంటర్‌లో ఖాళీలు ఉన్నాయో లేదో తెలుసుకోవాలని సూచించారు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2020 సెప్టెంబర్ 18 చివరి తేదీ అని అధికారులు వెల్లడించారు.

Follow Us
తెలంగాణ పోలీసులపై మహారాష్ట్రలో దాడి.. బేడీలతోనే దొంగ పరార్..
తెలంగాణ పోలీసులపై మహారాష్ట్రలో దాడి.. బేడీలతోనే దొంగ పరార్..
ఓటీటీలో దుమ్మురేపుతున్న తెలుగుల థ్రిల్లర్ మూవీ..
ఓటీటీలో దుమ్మురేపుతున్న తెలుగుల థ్రిల్లర్ మూవీ..
వన్డే వరల్డ్ కప్ నుంచి స్టార్ ప్లేయర్ ఔట్.. ఆసీస్ సంచలన నిర్ణయం
వన్డే వరల్డ్ కప్ నుంచి స్టార్ ప్లేయర్ ఔట్.. ఆసీస్ సంచలన నిర్ణయం
యూఎస్ మెరైన్ క్యాంప్‌పై ఇరాన్ క్షిపణి దాడి?
యూఎస్ మెరైన్ క్యాంప్‌పై ఇరాన్ క్షిపణి దాడి?
ఈ ఆకు సర్వరోగ నివారిణి.. ఉదయాన్నే ఇలా తిన్నారంటే.. బ్లడ్ షుగర్‌
ఈ ఆకు సర్వరోగ నివారిణి.. ఉదయాన్నే ఇలా తిన్నారంటే.. బ్లడ్ షుగర్‌
ఏఐ ప్లస్ నోవా 2 పవర్ 5జీలో స్పెషల్ ఫీచర్లు ఇవే
ఏఐ ప్లస్ నోవా 2 పవర్ 5జీలో స్పెషల్ ఫీచర్లు ఇవే
ఈ చిత్రంలో ఉన్న 8 మందిని, ఓ పిల్లిని గుర్తిస్తే.. మీరే తోపులు!
ఈ చిత్రంలో ఉన్న 8 మందిని, ఓ పిల్లిని గుర్తిస్తే.. మీరే తోపులు!
ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం.. బుధవారం దినఫలాలు ఎలా ఉన్నాయంటే..
ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం.. బుధవారం దినఫలాలు ఎలా ఉన్నాయంటే..
హారిజాంటల్ కెమెరాతో త్వరలో మార్కెట్‌లోకి షియోమీ 18 ఫోల్డ్‌
హారిజాంటల్ కెమెరాతో త్వరలో మార్కెట్‌లోకి షియోమీ 18 ఫోల్డ్‌
OTTలో మాధవన్ లేటెస్ట్ మూవీ.. నిజ జీవిత సంఘటనలతో తెరకెక్కిన సినిమా
OTTలో మాధవన్ లేటెస్ట్ మూవీ.. నిజ జీవిత సంఘటనలతో తెరకెక్కిన సినిమా