ఏపీ: సచివాలయాల్లో సేవా రుసుములు పెంపు.!
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గ్రామ, వార్డు సచివాలయాల్లో సేవా రుసుములను రెండు నుంచి మూడు రెట్లు పెంచుతూ జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది.
జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గ్రామ, వార్డు సచివాలయాల్లో సేవా రుసుములను రెండు నుంచి మూడు రెట్లు పెంచింది. సచివాలయాల్లో అత్యధిక పౌరసేవలకు ఇప్పటివరకు నామమాత్రంగా రూ. 15 వసూలు చేస్తూ వచ్చారు. అయితే ఇక నుంచి మీ-సేవా కేంద్రాల్లో వసూలు చేసే రుసుముల మొత్తాన్ని సచివాలయాల్లోనూ తీసుకోవాలని ప్రభుత్వం తాజాగా ఆదేశాలు జారీ చేసింది. కాగా, ఎక్కువమంది ప్రజలకు అవసరమైన సేవల రుసుములను రూ. 15 నుంచి రూ. 45 వరకు పెంచగా.. మరికొన్ని సేవలకు రూ. 35 వరకు వసూలు చేయనుంది. (Service Fees Increased)
Also Read: ఏపీ వెళ్లేవారికి గుడ్ న్యూస్.. రోడ్డెక్కిన బస్సులు.. వివరాలివే..