ఆన్‌లైన్‌లో ఎల్ఆర్ఎస్‌ సర్వీసు…

ఆన్‌లైన్‌లో ఎల్ఆర్ఎస్ (LRS) సర్వీసులను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అనధికారిక లేఅవుట్లలో ప్లాట్లను కొనుగోలు చేసిన వారు.. ఎల్ఆర్ఎస్ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కేటీఆర్ సూచించారు. అనధికారిక ప్లాట్లు, లేఅవుట్ల క్రమబద్దీకరణకు ఇది ఓ మంచి అవకాశమని అన్నారు. ఎల్ఆర్ఎస్ స్కీమ్​ద్వారా భూయజమానులు హక్కులను పొందడంతో పాటు.. ప్రభుత్వపరంగా మౌలిక సదుపాయాలను పొందడానికి అర్హులవుతారని  మంత్రి తెలిపారు. అక్టోబర్ 15లోగా ఎల్‌ఆర్‌స్‌కు దరఖాస్తు చేసుకున్న వారు.. 2021 జనవరి 31లోగా క్రమబద్ధీకరణ ఫీజును పూర్తిగా చెల్లించాలన్నారు. […]

ఆన్‌లైన్‌లో ఎల్ఆర్ఎస్‌ సర్వీసు...
Sanjay Kasula

|

Sep 07, 2020 | 6:50 PM

ఆన్‌లైన్‌లో ఎల్ఆర్ఎస్ (LRS) సర్వీసులను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అనధికారిక లేఅవుట్లలో ప్లాట్లను కొనుగోలు చేసిన వారు.. ఎల్ఆర్ఎస్ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కేటీఆర్ సూచించారు. అనధికారిక ప్లాట్లు, లేఅవుట్ల క్రమబద్దీకరణకు ఇది ఓ మంచి అవకాశమని అన్నారు. ఎల్ఆర్ఎస్ స్కీమ్​ద్వారా భూయజమానులు హక్కులను పొందడంతో పాటు.. ప్రభుత్వపరంగా మౌలిక సదుపాయాలను పొందడానికి అర్హులవుతారని  మంత్రి తెలిపారు.

అక్టోబర్ 15లోగా ఎల్‌ఆర్‌స్‌కు దరఖాస్తు చేసుకున్న వారు.. 2021 జనవరి 31లోగా క్రమబద్ధీకరణ ఫీజును పూర్తిగా చెల్లించాలన్నారు. ప్రభుత్వ స్థలాలు, అర్బన్ ల్యాండ్ సీలింగ్​మిగులు భూములకు.. దేవాదాయ, చెరువుల శిఖం భూముల్లో ఉన్న ప్లాట్లకు ఎల్ఆర్ఎస్ వర్తించదని తెలిపారు.

రెగ్యులరైజేషన్‌ ఆఫ్‌ అన్‌ అప్రూవ్‌డ్‌ అండ్‌ ఇల్లీగల్‌ లే అవుట్‌ రూల్స్‌ 2020 ఫర్‌ అర్బన్‌ అండ్‌ రూరల్‌ ఏరియా ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేసిన విషయం తెలిసిందే. ఆగస్టు 26 వరకూ రిజిస్ట్రేషన్‌ చేసుకున్న అనధికార, అక్రమ లే అవుట్‌లలోని స్థలాలు, ప్లాట్లను క్రమబద్ధీకరించుకునేందుకు వీలు కల్పిస్తూ తెలంగాణ సర్కార్ ఓ అవకాశం కల్పించింది. జీవో నంబరు 131ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ జారీ చేశారు. ఈ పథకం రాష్ట్రమంతటికీ వర్తించనుందని వెల్లడించారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu