Pawan Kalyan: అచ్యుతాపురం గ్యాస్‌ లీక్‌పై స్పందించిన జనసేనాని.. ప్రభుత్వ పెద్దలే బాధ్యత వహించాలంటూ

Atchutapuram Gas Leak: అచ్యుతాపురం బ్రాండిక్స్ గ్యాస్‌ లీకేజ్‌ ఘటనపై జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) స్పందించారు. ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసిన ఆయన ప్రమాదానికి కారణాలు ఇంతవరకు తెలియకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

Pawan Kalyan: అచ్యుతాపురం గ్యాస్‌ లీక్‌పై స్పందించిన జనసేనాని.. ప్రభుత్వ పెద్దలే బాధ్యత వహించాలంటూ
Pawan Kalyan
Follow us
Basha Shek

|

Updated on: Aug 04, 2022 | 12:02 PM

Atchutapuram Gas Leak: అచ్యుతాపురం బ్రాండిక్స్ గ్యాస్‌ లీకేజ్‌ ఘటనపై జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) స్పందించారు. ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసిన ఆయన ప్రమాదానికి కారణాలు ఇంతవరకు తెలియకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రజల ఆరోగ్యం, ప్రాణాలను పణంగా పెట్టి సాధించే పారిశ్రామికాభివృద్ధి రాష్ట్రానికి అవసరం లేదంటూ హితవు పలికారు. ‘విశాఖపట్నం సమీపంలోఇ అచ్యుతాపురసం సెజ్‌లో తరచూ చోటు చేసుకుంటున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. విశాఖలో ఎల్జీ పాలిమర్స్‌ ఎంతటి విధ్వంసాన్ని సృష్టించిందో, ఎంతమంది ప్రాణాలు గాల్లోకి కలిసిపోయాయో ఎప్పటికీ మర్చిపోలేం. అచ్యుతాపురం సెజ్‌లో దుస్తులు తయారుచేసుకునే కంపెనీలో విషవాయువులు లీకై 125 మంది మహిళలు తీవ్ర అస్వస్థతకు గురికావడం దురదృష్టకరం. ఈ ఘటనకు ప్రజాప్రతినిధులు, అధికారుల నిర్లిప్తతే కారణం. నెల క్రితం ఇదే కంపెనీలో ఇలాంటి ప్రమాదమే జరిగింది. అప్పుడు 400 మంది అస్వస్థతకు గురయ్యారు. ఇది మళ్లీ పునరావృతమైంది. అయితే ప్రమాదానికి గల కారణాలు అటు అధికారులు కానీ, కంపెనీ ప్రజా ప్రతినిధులు కానీ చెప్పకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది’ అని జనసేనాని పేర్కొన్నారు.

అలాంటి ప్రగతి అక్కర్లేదు..

ఇవి కూడా చదవండి

కాగా పారిశ్రామిక వాడల్లో ప్రమాదాల నివారణకు ప్రభుత్వం తీసుకోవాలని పవన్‌ సూచించారు. ‘పరవాడ, దువ్వాడ, అచ్యుతాపురం నెలకొన్ని ఔషధ, రసాయన, ఉక్కు, జౌళి కార్మాగారాల్లో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో చుట్టుపక్కల కాలనీ వాసులు, గ్రామస్తులు ఏ ప్రమాదం ఎప్పుడు ముంచుకొస్తుందో, ఏ విషవాయువు ప్రాణాలు తీస్తుందోనంటూ బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతుననారు. రాష్ట్రం, దేశ ప్రగతికి పరిశ్రమలు అవసరమే. అయితే ఆ ప్రగతి ప్రజల ఆరోగ్యం, ప్రాణాలను పణంగా పెట్టి కాదు. పారిశ్రామిక వాడల్లో ప్రమాదాల నివారణకు ప్రజా ప్రతినిధులు, అధికారులు కలసికట్టుగా నిచేయాలి. పరిశ్రమల్లో సేఫ్టీ ఆడిట్‌ పకడ్బందీగా చేపట్టాలి. పారిశ్రామిక ప్రగతికి ఏపీ ప్రభుత్వం అవినీతికి తావులేని విధంగా పని చేయాలి. ఎటువంటి వైఫల్యాలు ఎదురైనా ప్రభుత్వ పెద్దలే బాధ్యత వహించాలి. అచ్యుతాపురం సెజ్‌ ప్రమాదంలో అస్వస్థతకు గురైన మహిళా కార్మికులకు ప్రభుత్వం మెరుగైన వైద్యం అందించాలి. అదేవిధంగా బాధితులకు సరైన నష్టపరిహారాన్ని కూడా చెల్లించాలి’ అని జనసేనాని డిమాండ్‌ చేశారు.

మరిన్ని ఏపీవార్తల కోసం క్లిక్ చేయండి..