మారుమూల పల్లెల్లోనూ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు..

పేదల సొంతింటి కలను రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సాకారం చేస్తున్నారని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వెల్లడించారు. అందులో భాగంగానే మారుమూల పల్లెల్లోనూ డబుల్ బెడ్రూమ్ పథకం అమలు చేస్తున్నారని చెప్పారు.

మారుమూల పల్లెల్లోనూ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు..
Follow us

|

Updated on: Jun 26, 2020 | 7:24 PM

పేదల సొంతింటి కలను రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సాకారం చేస్తున్నారని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వెల్లడించారు. అందులో భాగంగానే మారుమూల పల్లెల్లోనూ డబుల్ బెడ్రూమ్ పథకం అమలు చేస్తున్నారని చెప్పారు. మారుమూల ప్రాంతంలో పేదలకు డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లు నిర్మించి ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చర్ల గ్రామం లక్ష్మీ కాలనీలో రూ. 3.77 కోట్లతో నూతనంగా నిర్మించిన 65 డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లను మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మలోతు కవిత, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీ నారాయణ, ప్రభుత్వ విప్‌ రేగా కాంతారావు, ఎమ్మెల్యే పొదెం వీరయ్య, జడ్పీ చైర్మన్‌ కోరం కనకయ్య, జిల్లా కలెక్టర్‌ ఎంవీ రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి పువ్వాడ మాట్లాడుతూ… రాష్ట్ర అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్‌ పాటుపడుతున్నారని చెప్పారు. చర్ల, దుమ్ముగూడెం మండలాల్లో ఏ అభివృద్ధి పని కావాలన్నా చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు.