గుంటూరు జీజీహెచ్‌లో ముగ్గురు వైద్యులకు కరోనా
ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఇప్పటికే నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 11వేలను దాటేసింది. ఇదిలా ఉంటే గుంటూరులోని జీజీహెచ్ ఆసుపత్రిలో కరోనా కలకలం రేపింది.

ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఇప్పటికే నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 11వేలను దాటేసింది. ఇదిలా ఉంటే గుంటూరులోని జీజీహెచ్ ఆసుపత్రిలో కరోనా కలకలం రేపింది. ఆసుపత్రిలో ముగ్గురు డాక్టర్లకు ఈ వైరస్ సోకింది. కాగా ఈ వైద్యులు ఇటీవల అత్యాచారానికి గురైన బాలికకు చికిత్స చేశారు. దీంతో ఆ బాలికతో పాటు ఆమె తల్లికి కూడా కరోనా సోకింది. ఈ క్రమంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. వైద్యులతో పాటు బాలిక కాంటాక్ట్ కేసులను కనుగునే పనిలో పడ్డారు. కాగా ఏపీలో కరోనా కేసుల సంఖ్య 11489 చేరింది. వీరిలో 5169 మంది కోలుకోగా.. 6147 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 146 మంది ఈ వైరస్ సోకి మృత్యువాతపడ్డారు. 7,91,624 కరోనా పరీక్షలను నిర్వహించారు.



