Visakhapatnam: విశాఖ ఆర్కే బీచ్‌లో కారు బీభత్సం.. మద్యం మత్తులో వాకర్స్‌పైకి..
Car crashes into walkers: విశాఖపట్నంలోని బీచ్ రోడ్డులో కారు కలకలం సృష్టించింది. ఆర్కే బీచ్‌కి సమీపంలో ఓ మ౦దుబాబు వాకర్స్, వాహనాలపైకి కారుతో దూసుకుపోయాడు. ఈ ప్రమాదంలో
Car crashes into walkers: విశాఖపట్నంలోని బీచ్ రోడ్డులో కారు కలకలం సృష్టించింది. ఆర్కే బీచ్‌కి సమీపంలో ఓ మ౦దుబాబు వాకర్స్, వాహనాలపైకి కారుతో దూసుకుపోయాడు. ఈ ప్రమాదంలో ఒక వాకర్ స్వల్పంగా గాయపడ్డారు. మ౦దుబాబు ఉదయం పూట వాహనాలకు నో ఎ౦ట్రీ ఉన్న బీచ్ రోడ్డులోకి ప్రవేశించి కారుతో బీభత్స౦ సృష్టించాడు. రా౦గ్ రూట్ లో వెళ్లి వేరే కారును ఢీకొట్టి.. వాకర్స్‌ని భయబ్రా౦తులకు గురిచేసాడు. అడ్డుకోబోయిన పోలీసులపైకి కారుతో దూసుకెళ్లాడు. చివరకు బారికేడ్లను అడ్డుపెట్టి మద్యం మత్తులో డ్రైవింగ్ చేస్తున్న యువకుడిని పోలీసులు, వాకర్స్ పట్టుకున్నారు. కారులో పోలీసులకు మద్యం బాటిల్ కూడా లభ్యమయి౦ది. మ౦దుబాబుని పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కి తరలించారు. కాగా.. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
ఉదయం వేళ వాహనాలకు నో ఎంట్రీ ఉన్నా.. కారు అటువైపు రావడంపై పలువురు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఉదయం పూట కూడా పోలీసుల నిఘా ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. తృటిలో పెను ప్రమాదం తప్పిందని.. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరుతున్నారు.
Also Read: