Visakhapatnam: చిన్నారిని ఎత్తుకుని పరిగెత్తిన అజ్ఞాత వ్యక్తి.. వెంటబడ్డ అటో డ్రైవర్.. సీన్ కట్ చేస్తే.!
అర్ధరాత్రి.. విశాఖ బీచ్ రోడ్.. చిన్నారి ఏడుస్తూ కనిపించింది. చూస్తే ముగ్గురు వ్యక్తులు చేతుల్లో చిన్నారి ఉంది . వారి కదలికల్లో ఏదో తేడాగా అనిపిస్తుంది. అంతలో అటుగా వెళుతున్న ఆటో డ్రైవర్.. అనుమానం వచ్చి ప్రశ్నించేందుకు ప్రయత్నించాడు.దాంతో చిన్నారిని వదిలేసి పరుగులు తీశారు ఆ ముగ్గురు అనుమానితులు. వెంబడించి మరీ...

అర్ధరాత్రి.. విశాఖ బీచ్ రోడ్.. చిన్నారి ఏడుస్తూ కనిపించింది. చూస్తే ముగ్గురు వ్యక్తులు చేతుల్లో చిన్నారి ఉంది . వారి కదలికల్లో ఏదో తేడాగా అనిపిస్తుంది. అంతలో అటుగా వెళుతున్న ఆటో డ్రైవర్.. అనుమానం వచ్చి ప్రశ్నించేందుకు ప్రయత్నించాడు.దాంతో చిన్నారిని వదిలేసి పరుగులు తీశారు ఆ ముగ్గురు అనుమానితులు. వెంబడించి మరీ…
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీచ్ రోడ్ లో యాచక వృత్తి చేసుకుంటూ ఓ దంపతులు జీవిస్తున్నారు. వారికి పది నెలల చిన్నారి కూడా ఉంది. అయితే.. అందరూ నిద్రిస్తున్న సమయంలో ఆ కుటుంబాన్ని గమనించిన నిందితులు.. ఆ చిన్నారిని కిడ్నాప్ చేయాలని ప్లాన్ చేశారు. స్కెచ్ వేసి మరీ శనివారం రాత్రి.. బాలుడిని మెల్లగా ఎత్తుకెళ్లారు. ఆర్కే బీచ్ నుంచి కోస్టల్ బ్యాటరీ వైపు బాలుడిని ఎత్తుకొని వెళ్ళారు. అదే సమయంలో ఆ చిన్నారి ఏడవడం మొదలుపెట్టింది. దీంతో అటుగా వస్తున్న ఆటో డ్రైవర్ నీలాద్రి అది చూశాడు. బాలుడు ఏడుస్తూ ఉన్నాడు వాళ్ళ ప్రవర్తనలో ఏదో అనుమానం కలిగింది ఆటో డ్రైవర్ నీలాద్రికి. దీంతో వాళ్లను ఎవరు మీరంటూ..? ప్రశ్నించాడు. దాంతో వెంటనే చిన్నారిని విడిచి పారిపోయే ప్రయత్నం చేస్తారు. వెంబడించి వారిలో ఒకరిని పట్టుకున్నాడు ఆటో డ్రైవర్. ఒకవైపు చిన్నారి మరోవైపు నిందితుడు పట్టుకొని పోలీస్ స్టేషన్ కు వెళ్ళాడు ఆటో డ్రైవర్. అక్కడ సమాచారం అందించాడు. ఆ సమయంలో నైట్ రౌండ్స్ ముగించుకొని స్టేషన్ కు చేరుకున్న ఎస్.ఐ లక్ష్మి వెంటనే చిన్నారి ని తీసుకొని ఆర్.కే బీచ్ వద్దకు వెళ్లారు. దింతో పాప కోసం వెతుకుతున్న వారి తల్లితండ్రులు కనిపించారు. తల్లిదండ్రులు వారేనని నిర్ధారించి ఆ చిన్నారిని వారికి అప్పగించారు.
ఇద్దరి అరెస్ట్.. ఆటో డ్రైవర్ కు అభినందన..
-కిడ్నాప్ చేయడానికి యత్నించిన వ్యక్తిని విచారించారు పోలీసులు. దింతో అసలు విషయం చెప్పాడు నిందితుడు. విజయవాడ నుంచి తాము ముగ్గురు రెండు రోజుల కిందటే విశాఖ వచ్చామని.. ఆర్క్ బీచ్ వద్ద యాచకులైన ఒక కుటుంబాన్ని చూసి వారి 10 నెలల చిన్నారిని కిడ్నాప్ చేయాలనే ప్లాన్ చేశామని పోలీసులకు వివరించాడు. రెండు రోజులు పాటు గమనిస్తూ,.. అప్పటికే రెండు సార్లు ప్రయత్నించి, చివరిగా ఆదివారం తెల్లవారుజామున కిడ్నాప్ చేసి నోవేటల్ వైపు తీసుకువెళ్తున్న సమయంలో ఆటో డ్రైవర్ అపి గట్టిగా ప్రశ్నించడంతో అక్కడ నుంచి పరారు అయినట్లు తెలిపాడు నిండితుడు. ఆ తరువాత మిగిలిన ఇద్దరి కోసం గాలించిన పోలీసులు.. రైల్వే స్టేషన్ వద్ద మరొకరిని అదుపులోకి తీసుకున్నారు. ఫకీర్, ప్రసాద్ లను అరెస్టు చేశారు పోలీసులు. చిన్నారిని కాపాడి తిరిగి తన తల్లదండ్రుల వద్దకు చేర్చిన ఆటో డ్రైవర్ బైపిల్లి నీలాద్రిని సిపి రవి శంకర్.. తన కార్యాలయానికి పిలిచి అభినందించారు. సాహసం చేసి కిడ్నాపర్ల చెరనుంచి చిన్నారిని రక్షించిన నీలాద్రికి .. క్యాష్ రివార్డ్ మెమెంటో ఇచ్చి సత్కరించారు. మరో నిందితుడు హరిబాబు కోసం పోలీసులు గాలిస్తున్నారు. తమ చిన్నరిని క్షేమంగా తమ వద్దకు చేర్చిన ఆటో డ్రైవర్ నీలాద్రి, పోలీసులకు పేద దంపతులు కృతజ్ఞతలు తెలిపారు.

