Visakhapatnam: ‘చేతులెలా వచ్చాయమ్మా..?’ ప్రియుడి కోసం కొడుకును హతమార్చిన కసాయి తల్లి
ఓ అపార్ట్మెంట్.. ఉన్నట్టుండి నీటి సంపు నుంచి ఒక్కసారిగా దుర్వాసన..! ఎక్కడ నుంచి వస్తుందా అని అంతా వెతికారు. చివరకు నీటి సంపు మూత ఎత్తి చూస్తే.. అంతా ఒక్కసారిగా షాక్..! ఎందుకంటే ఆ నీటి సంపులో బాలుడు మృతదేహం. అది కూడా ఎప్పుడూ తమ కళ్ళముందు ఆడుకునే వాచ్‌మెన్ కొడుకు వేదాంత..! నీటిలో ఆడుకుంటూ పడిపోయాడా..? ఇంత జరుగుతుంటే ఆ తల్లి ఎక్కడికి వెళ్ళింది..? సీసీ ఫుటేజ్‌లో చూస్తే అసలు విషయం బయటపడింది. బయటికి తల్లి వెంట వెళ్లిన..

గాజువాక, అక్టోబర్ 31: ఓ అపార్ట్మెంట్.. ఉన్నట్టుండి నీటి సంపు నుంచి ఒక్కసారిగా దుర్వాసన..! ఎక్కడ నుంచి వస్తుందా అని అంతా వెతికారు. చివరకు నీటి సంపు మూత ఎత్తి చూస్తే.. అంతా ఒక్కసారిగా షాక్..! ఎందుకంటే ఆ నీటి సంపులో బాలుడు మృతదేహం. అది కూడా ఎప్పుడూ తమ కళ్ళముందు ఆడుకునే వాచ్‌మెన్ కొడుకు వేదాంత..! నీటిలో ఆడుకుంటూ పడిపోయాడా..? ఇంత జరుగుతుంటే ఆ తల్లి ఎక్కడికి వెళ్ళింది..? సీసీ ఫుటేజ్‌లో చూస్తే అసలు విషయం బయటపడింది. బయటికి తల్లి వెంట వెళ్లిన బాలుడు.. తిరిగి వచ్చేటప్పుడు కనిపించకపోవడంతో.. పోలీసుల ఇన్వెస్టిగేషన్‌లో ఇద్దరు చిక్కారు. అసలేం జరిగిందంటే..
శృంగవరపుకోటకు చెందిన దొరబాబు.. గాజువాక పంతులు గారి మేడ వద్ద అపార్ట్‌మెంట్ వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. సెల్లార్లోనే భార్యమని ఇద్దరు పిల్లలు శంకర్ వేదంతో కలిసి ఉంటున్నారు. శనివారం నాడు అపార్ట్మెంట్ సంపు నుంచి దుర్వాసన రావడంతో దొరబాబు వెళ్లి చూశాడు. కొడుకు వేదాంత విగత జీవిగా కనిపించడంతో కన్నీరు మునిరయ్యాడు. భార్యాభర్తల మధ్య ఇటీవల మనస్పర్ధాలు ఏర్పడ్డాయి. ఈనెల 24న.. భర్తతో గొడవ పడి ఆమె వెళ్ళిపోయింది. అప్పుడు నుంచి వేదాంత కూడా కనిపించకుండా పోయాడు. దీంతో డబ్బు తీసుకెళ్లి ఉంటాడని భర్త భావించాడు.
అందులో మృతదేహం
అపార్ట్‌మెంట్‌లో నీటి సంపు నుంచి దుర్వాసన వస్తోంది. దీంతో ఈనెల 28న.. చూసేసరికి సంపులో వేదాంత అనే బాలుడు మృతదేహం కనిపించింది. ఒక్కసారిగా ఈ ఘటనతో తండ్రి వాచ్‌మెన్ ఉలిక్కిపడ్డాడు. ఆడుకుంటూ పడిపోయి ఉండొచ్చు అని భావించారు. అయితే బాలుడు తల్లి కనిపించకుండా పోవడంతో అప్పటికి భర్తకు అనుమానం రాలేదు. ఎందుకంటే ఎప్పుడు భార్య రెండు మూడు రోజులపాటు అలిగి వెళ్లి తిరిగి వస్తుందని అనుకున్నాడు. ఈనెల 24న కూడా భర్త దొరబాబుతో భార్య మణి గొడవ పడింది. ఆ తర్వాత.. ఇంటి నుంచి వెళ్ళిపోయి తిరిగి రాలేదు. అయితే చిన్న కొడుకు కనిపించకపోవడంతో తల్లి తీసుకుని వెళ్లి ఉంటుందని దొరబాబు భావించాడు.
సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యాలు
దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు అనుమానాస్పద మృతి కేసు నమోదు చేశారు. దర్యాప్తు ప్రారంభించి సీసీ ఫుటేజీ లను పరిశీలించారు. అయితే, మణి భర్తతో గొడవ పడిన రోజు రాత్రి బాలుడిని తనతో పాటు తీసుకెళ్తున్నట్టు కనిపించింది. కొద్దిసేపటికి ఒంటరిగా తిరిగి వస్తున్నట్టు కూడా రికార్డ్ అయింది. అయితే మణి సంపు వైపు వెళ్లి వస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. దీంతో మణిపై అనుమానం కలిగిన పోలీసులు ఆమె కోసం గాలించారు. హైదరాబాదులో ఉన్నట్టు తెలుసుకొని ప్రత్యేక బృందాలు అక్కడికి వెళ్లాయి. మణి అదుపులోకి తీసుకుని విచారించేసరికి అసలు విషయాన్ని ఒప్పుకుంది. తానే బాలుడిని సంపులో పడేసినట్టు పోలీసుల ముందు చెప్పిందని అన్నారు సిఐ భాస్కర్ రావు.
వాడికోసం బాలుడ్ని అలా..
అయితే గతంలోనూ భర్తతో గొడవపడి నాలుగు సార్లు హైదరాబాద్ వెళ్ళిపోయింది మణి. అక్కడ ఉప్పల్‌లో పనిచేస్తున్న కాకినాడకు చెందిన పాత గంజాయి నిందితుడు పనస కుమార్ తో పరిచయం ఏర్పడింది. తన సోదరి ఇంటికి వెళ్లే క్రమంలో రైల్లో పరిచయమైన పనస కుమార్‌తో మణికి వివాహేతర బంధం ఏర్పడింది. అయితే.. తరచూ భర్తతో గొడవపడే మణి తాజాగా అలిగి వెళ్లిపోయేది. అదే సమయంలో చిన్న కొడుకు వేదాంత్ కూడా తల్లితోపాటు వెళ్ళేందుకు మారం చేశాడు. ఎలాగైనా బాలుడిని వదిలించుకుని వెళ్లిపోవాలనుకుంది మణి. అందర్నీ విడిచిపెట్టి వస్తే పెళ్లి చేసుకుంటానని పన సుకుమార్ చెప్పడంతో వెంటపడుతున్న బాలుడిని సంపులో పడేసింది తల్లి. ఆ తర్వాత ప్రియుడి మొజులో హైదరాబాద్‌కి వెళ్లింది. నిందితురాలు మణితో పాటు ఆమె ప్రియుడు పనస కుమార్‌ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.
భర్త పిల్లలను కాదని.. ప్రియుడి మోజులో పడిన ఈ వివాహిత.. చివరకు కనికరం లేకుండా కన్న కొడుకును చంపేసింది. ఆపై ఏమి ఎరగనట్టు ఇంటి నుంచి వెళ్లిపోయింది. దీంతో అప్పటి వరకు తల్లితోనే బాలుడు వెళ్లి ఉంటాడని అనుకున్నారంతా. తీరా బాలుడి శవం బయటపడటంతో ప్రమాదవశాత్తు పడిపోయి ఉంటాడని అనుకున్నారు. చివరకు తల్లి మాటున ఉన్న కర్కశత్వం వెలుగులోకి రావడంతో ఆ తండ్రి కుములిపోయాడు. మణి చేసిన పనికి అంతా ముక్కున వేలేసుకున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.




