AP News: జాలి పడితే జేబు ఖాళీ.. మరీ ఇంత బరితెగిస్తారా.. సోషల్ మీడియాలో గోల చేస్తున్న బాదితులు..
పరుగు పరుగునా వెళ్లి సహాయం చేస్తాం. కానీ, ఇక్కడ మాత్రం అలాంటి తప్పు అస్సలు చేయకండి. జాలిపడి వారిని పైకి లేపారా అది మీకే నష్టం.. తస్మాత్ జాగ్రత్త.. అదేంటి మన కళ్ళ ముందు బైక్ పై వెళుతూ ఎవరైనా పడిపోతే వారిని పైకి లేపకుండా ఎలా ఉండగలమని ఆలోచిస్తున్నారా.. నిజంగా ఇది మీకోసమే.. కొందరు కేటుగాళ్లు కొత్త రకం మోసాలకు తెర తీశారు. రోజు రోజుకు దొంగలు తమ నైపుణ్యాన్ని పెంపొందించుకుంటూ ఎత్తుకు పైఎత్తులు వేస్తూ చాకచక్యంగా ..

ఏలూరు, అక్టోబర్ 31: అయ్యో పాపం అంటూ జాలి పడ్డారా.. మీ పని ఖతం.. మీ ముందే ఎవరైనా బైక్ అద్బుతప్పి పడిపోతున్నారా.. ముఖ్యంగా పల్సర్ బైక్ పైనే ప్రయాణం చేసేవారు ఇలాంటి ప్రమాదాలకు గురవుతున్నారా.. సరే పడిపోయారనే అనుకుందాం.. పరుగు పరుగునా వెళ్లి సహాయం చేస్తాం. కానీ, ఇక్కడ మాత్రం అలాంటి తప్పు అస్సలు చేయకండి. జాలిపడి వారిని పైకి లేపారా అది మీకే నష్టం.. తస్మాత్ జాగ్రత్త.. అదేంటి మన కళ్ళ ముందు బైక్ పై వెళుతూ ఎవరైనా పడిపోతే వారిని పైకి లేపకుండా ఎలా ఉండగలమని ఆలోచిస్తున్నారా.. నిజంగా ఇది మీకోసమే.. కొందరు కేటుగాళ్లు కొత్త రకం మోసాలకు తెర తీశారు.
రోజు రోజుకు దొంగలు తమ నైపుణ్యాన్ని పెంపొందించుకుంటూ ఎత్తుకు పైఎత్తులు వేస్తూ చాకచక్యంగా తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. వారి పట్ల జాగ్రత్తగా ఉండకపోతే మన జేబులు ఖాళీ అవటం మాత్రం ఖాయం.. ఇప్పుడు ప్రస్తుతం ఏలూరు జిల్లాలో ఇదే హాట్ టాపిక్ గా మారింది.
లైట్ గా తీసుకుంటే ఇక అంతే..
సోషల్ మీడియాలో సైతం బాధితులు పెద్ద ఎత్తున ఈ ఘటనలపై స్పందిస్తున్నారు. ఏదో ఒకచోట జరిగింది అని లైట్ గా తీసుకుంటే చాలా ప్రమాదం.. జిల్లాలో ప్రతి చోట ఇలాంటి ఘటనలు వెలుగు చూస్తున్నాయి.. అయితే దీన్ని సాధారణంగా లైట్ గా తీసుకుంటే రాను రాను పెను ప్రమాదంగా మారే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు. అసలు బైక్ పై కింద పడిన వారిని లేపడం వల్ల కలిగే నష్టమేమిటి.. సోషల్ మీడియాలో వారిపై జరుగుతున్న ప్రచారం ఏంటి అనేది పూర్తి వివరాలు తెలుసుకుందాం.
ఇటీవల జంగారెడ్డిగూడెం, కామవరపుకోట మండలాల్లో మొబైల్ ఫోన్ దొంగతనాలు విపరీతంగా పెరిగిపోయాయి. అయితే గతంలో దొంగలు రద్దీగా ఉండే ప్రదేశాలలో, పుణ్యక్షేత్రాలలో, బస్సులు ఎక్కే దిగే క్రమంలో మొబైల్ ఫోన్ దొంగతనాలు ఎక్కువగా జరిగేవి.. అయితే అలాంటి చోరీలపై పోలీసులు రద్దీ ఉన్న ప్రదేశాలలో.. బస్టాండ్ల వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడంతో వారు ఎత్తులు పారడం లేదు.
దాంతో సరికొత్త మొబైల్ చోరీల కోసం దొంగలు సరికొత్త ఆలోచన చేశారు. ఇద్దరు వ్యక్తులు ఓ పల్సర్ బైక్ పై ప్రయాణం చేస్తూ ఎవరైతే రోడ్డుపై నడుచుకుంటూ వస్తున్నారో వారి ముందు బైక్ పై అదుపుతప్పి పడిపోతున్నారు. అయ్యో పాపం అని బైక్ పై నుండి పడిన వారిని లేపటానికి మనం అక్కడికి వెళ్లి వారిని పైకి లేపుతున్న సమయంలో ఎంతో చాకచక్యంగా వారికి సహాయం చేయడానికి వచ్చిన వారి జేబుల్లో నుంచి మొబైల్ ఫోన్లు దొంగలిస్తున్నారు.
అయితే బాధితుడు తన ఫోను పోయిందనే విషయం గమనించుకోకుండా బైక్ పై పడ్డవారికి ఎలాంటి గాయాలు లేవు కదా అని ఊపిరి పీల్చుకునే లోపు వారు అక్కడ నుంచి ఉడాయిస్తున్నారు. తీరా వారు అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత అసలు విషయం తెలిసి లబోదిబోమంటున్నారు.

Social Media Comments
ఇటీవల కామవరపుకోటలో ఇలాంటి దొంగతనాలు తరచూ జరుగుతున్నాయి. పలువురు బాధితులు పోలీసులను ఆశ్రయిస్తుంటే మరికొందరు బాధితులు సోషల్ మీడియా వేదికగా తమకు జరిగిన అనుభవాన్ని తమ మిత్రులతో పంచుకుంటున్నారు. ఇటీవల ఇలా పెట్టిన ఓ పోస్ట్ కు చాలామంది బాధితులు తాము జంగారెడ్డిగూడెంలో సైతం ఇలాంటి ఘటనలో మోసపోయినట్లు తెలిపారు. అదే రకంగా, వేరు వేరు చోట్ల ఇదేవిధంగా బైక్ ప్రమాదం జరిగినట్లుగా నమ్మించి మొబైల్ ఫోన్లు దొంగిలించే ముఠా గురించి ప్రతి ఒక్కరూ తమకు తెలిసిన విషయాలు షేర్ చేస్తున్నారు.
దాంతో ఇప్పటికే ఆ ముఠా ఇప్పటికే ఎంతోమంది మొబైల్ ఫోన్లో చాకచక్యంగా చోరీ చేసినట్లు తెలుస్తోంది. ఇలాంటి ఘటనలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పలువురు హెచ్చరిస్తున్నారు. ఎవరైనా వ్యక్తులు పల్సర్ బైక్ పై వచ్చి తమ ముందు అదుపుతప్పి పడిపోయినట్లుగా ఉంటే ఆచితూచి పూర్తి వివరాలు తెలుసుకుని మాత్రమే వారికి సహాయం చేయాలని సూచిస్తున్నారు. ఎందుకంటే నష్టం జరిగిన తర్వాత మనం ఎంత మొత్తుకున్నా నష్టాన్ని భర్తీ చేసుకోలేమనే విషయం ఇపుడు సందేశంగా మారింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
