AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శ్రీ కొండా లక్ష్మణ్‌ తెలంగాణ హార్టికల్చరల్ వర్సిటీలో ఉద్యోగాలకు నోటిఫికేషన్.. నెలకు రూ.2,18,200 జీతం

శ్రీ కొండ లక్ష్మణ్‌ తెలంగాణ హార్టికల్చరల్ యూనివర్సిటీ (SKLTGHU) ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు జనవరి 31, 2026వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలి. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం..

శ్రీ కొండా లక్ష్మణ్‌ తెలంగాణ హార్టికల్చరల్ వర్సిటీలో ఉద్యోగాలకు నోటిఫికేషన్.. నెలకు రూ.2,18,200 జీతం
Sri Konda Laxman Telangana State Horticultural University Recruitment
Srilakshmi C
|

Updated on: Jan 02, 2026 | 8:36 AM

Share

సిద్దిపేట జిల్లాలోని శ్రీ కొండ లక్ష్మణ్‌ తెలంగాణ హార్టికల్చరల్ యూనివర్సిటీ (SKLTGHU) ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు జనవరి 31, 2026వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలి. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 79 అసిస్టెంట్‌ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు 44, ప్రొఫెసర్‌ పోస్టులు 17 వరకు ఉన్నాయి. అగ్రికల్చరల్‌ ఇంజినీరింగ్‌, అగ్రోనమీ, బయోకెమిస్ట్రీ, క్రాప్‌ ఫిజియోలజీ, ఎంటమాలజీ, ప్లాంట్‌ పాథాలజీ, ఫ్రూట్‌ సైన్స్‌, వెజిటేబుల్స్, ఫ్లోరికల్చర్‌ తదితర విభాగాల్లో ఈ పోస్టులను భర్తీ చేయనుంది. ఇతర వివరాలు ఈ కింద చెక్‌ చేసుకోండి

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత విభాగంలో పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. అలాగే సంబంధిత సబ్జెక్టులో బోధనానుభతవం కూడా ఉండాలి. ఆసక్తి కలిగిన వారు దరఖాస్తు ఫీజు ఓసీ, బీసీ అభ్యర్థులు రూ.4000, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.2,500 చొప్పున చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఏపీఐ అండ్‌ పీబీఏఎస్‌ స్కోరు, ఉద్యోగానుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు రూ.1,31,400 నుంచి రూ.2,17,100 వరకు, ప్రొఫెసర్‌ పోస్టులకు రూ.1,44,200 నుంచి రూ.2,18,200 వరకు జీతంగా చెల్లిస్తారు.

అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ నుంచి దరఖాస్తు ఫారమ్ డౌన్‌లోడ్ చేసుకుని, దానికి నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలు, డిమాండ్ డ్రాఫ్ట్ (DD) జతచేసి ఈ కింది రిజిస్ట్రార్ కార్యాలయం అడ్రస్‌కి పోస్టు ద్వారా పంపించవల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

అడ్రస్

The Registrar, Sri Konda Laxman Telangana Horticultural University, Administrative Office, Mulugu (V&M), Siddipet District – 502 279.

నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.