AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP 10th Supplementary Hall Tickets: మరో 3 రోజుల్లోనే పదో తరగతి సప్లిమెంటరీ 2026 పరీక్షలు.. హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ లింక్‌

పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు మరో మూడు రోజుల్లో ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ఈ పరీక్షలకు సంబంధించిన హాల్‌ టికెట్లను ప్రభుత్వ పరీక్షల విభాగం విడుదల చేసింది. పాఠశాల లాగిన్‌, సెకండరీ విద్య బోర్డు, మనమిత్ర వాట్సప్‌ 95523 00009 ద్వారా విద్యార్ధులు హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు..

AP 10th Supplementary Hall Tickets: మరో 3 రోజుల్లోనే పదో తరగతి సప్లిమెంటరీ 2026 పరీక్షలు.. హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ లింక్‌
AP SSC Supplementary Hall Tickets
Srilakshmi C
|

Updated on: May 22, 2026 | 7:02 AM

Share

అమరావతి, మే 22: ఆంధ్రప్రదేశ్‌ పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు మరో మూడు రోజుల్లో ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ఈ పరీక్షలకు సంబంధించిన హాల్‌ టికెట్లను ప్రభుత్వ పరీక్షల విభాగం విడుదల చేసింది. పాఠశాల లాగిన్‌, సెకండరీ విద్య బోర్డు, మనమిత్ర వాట్సప్‌ 95523 00009 ద్వారా విద్యార్ధులు హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ మేరకు పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల హాల్‌టికెట్లు జారీ చేసినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు శ్రీనివాసులు రెడ్డి ప్రకటించారు.

ఏపీ పదో తరగతి సప్లిమెంటరీ 2026 హాల్ టికెట్ల డైన్ లోడ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

విద్యార్థులు మార్చిలో నిర్వహించిన ఎస్సెస్సీ మార్చి 2026 నాటి పాత రోల్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను ఎంటర్ చేసి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇక షెడ్యూల్‌ ప్రకారం పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 25 నుంచి జూన్ 4 వరకు నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి.

ఇవి కూడా చదవండి

TG Polycet 2026 Results: రేపే తెలంగాణ పాలీసెట్‌ 2026 ఫలితాలు.. కౌన్సెలింగ్‌ ఎప్పట్నుంచో తెలుసా?

ఏపీ పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల 2026 టైమ్ టేబుల్ ఇదే

  • మే 25 (సోమవారం): ఫస్ట్ లాంగ్వేజ్ (గ్రూప్-A)
  • మే 26 (మంగళవారం): సెకండ్ లాంగ్వేజ్
  • మే 28 (గురువారం): ఇంగ్లీష్
  • మే 29 (శుక్రవారం): మ్యాథమెటిక్స్ (గణితం)
  • మే 30 (శనివారం): ఫిజికల్ సైన్స్ (భౌతిక శాస్త్రం)
  • జూన్ 1 (సోమవారం): బయాజికల్ సైన్స్ (జీవశాస్త్రం)
  • జూన్ 2 (మంగళవారం): సోషల్ స్టడీస్ (సాంఘిక శాస్త్రం)
  • జూన్ 3 (బుధవారం): ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-II (కాంపోజిట్ కోర్స్)
  • జూన్ 4 (గురువారం): OSSC మెయిన్ లాంగ్వేజ్ పేపర్-I (సంస్కృతం, అరబిక్, పర్షియన్)

Follow Us