అంతర్వేది రథం ఘటన.. అప్రమత్తమైన టీటీడీ

అంతర్వేది రథం దగ్ధం ఘటన నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం అప్రమత్తమైంది. టీటీడీ ఆలయాల వద్దనున్న రథాలకు మరింత భద్రతను పెంచారు

అంతర్వేది రథం ఘటన.. అప్రమత్తమైన టీటీడీ
Follow us

| Edited By:

Updated on: Sep 11, 2020 | 9:46 AM

Tirumala Tirupati Devastanam: అంతర్వేది రథం దగ్ధం ఘటన నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం అప్రమత్తమైంది. టీటీడీ ఆలయాల వద్దనున్న రథాలకు మరింత భద్రతను పెంచారు. తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయం, శ్రీ కోదండరామ స్వామి ఆలయం, తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయాలకు చెందిన రథాల వద్ద అధికారులు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. స్థానిక పోలీసులతో పాటు టీటీడీ సెక్యూరిటీతో భద్రతా ఏర్పాట్లను పెంచారు. ఆలయ పరిసరాల్లో నిరంతర నిఘా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. అయితే ప్రముఖ అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో 60ఏళ్ల నాటి రథం దగ్ధమైన విషయం తెలిసిందే. ఈ ఘటన ఏపీలో కలకలం సృష్టించగా, రాజకీయంగానూ వివాదంగా మారింది. ఈ క్రమంలో ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, డీజీపీ గౌతమ్ సవాంగ్‌కి ఆదేశాలు జారీ చేశారు.

Read More:

నేడు వైఎస్సార్ ఆసరా పథకం ప్రారంభించనున్న సీఎం జగన్

కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో 2,426 కొత్త కేసులు.. 13 మరణాలు