వ్యాపారి కుటుంబంలో ‘కరోనా’ విషాదం.. 20 రోజుల వ్యవధిలో ముగ్గురు మృతి
మంచిర్యాలలో విషాదం నెలకొంది. జిల్లా కేంద్రంలోని చింతపండు వాడలో కరోనాతో ఓ వ్యాపారి కుటుంబంలోని ముగ్గురు మృతి చెందారు.

Three died in Mancherial: మంచిర్యాలలో విషాదం నెలకొంది. జిల్లా కేంద్రంలోని చింతపండు వాడలో కరోనాతో ఓ వ్యాపారి కుటుంబంలోని ముగ్గురు మృతి చెందారు. 20 రోజుల వ్యవధిలో తండ్రి, ఇద్దరు కుమారులు కరోనాతో మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే చెన్నూరుకు చెందిన కినారపు భూమయ్య ( 72 ) జిల్లా కేంద్రమైన మంచిర్యాలలో వ్యాపారం చేస్తూ స్థిరపడ్డారు. ఆయనకు నలుగురు కుమారులు ఉండగా.. 20 సంవత్సరాల క్రితం అనారోగ్యంతో చిన్న కుమారుడు మృతి చెందాడు.
ఇక గత నెలలో భూమయ్యతో పాటు రెండో కుమారుడు కిరణ్ కుమార్(43), చిన్నారులకు కరోనా సోకింది. తండ్రీకొడుకులను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. చిన్నారులు హోం ఐసోలేషన్‌లో ఉండి కోలుకోగా.. భూమయ్య చికిత్స పొందుతూ గత నెల 22న చనిపోయారు. ఆ తరువాత మరో కుమారుడు కిషోర్ కుమార్(45)కరోనా సోకగా.. దీంతో అతడిని హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో ఈ నెల 4న కిషోర్ కుమార్ మరణించారు. ఈ విషాదం నుంచి తేరుకునే లోపే కిరణ్ కుమార్ బుధవారం రాత్రి చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఇలా 20 రోజుల వ్యవధిలో కుటుంబ పెద్దతో పాటు ఇద్దరు కుమారులు కరోనాకు బలవ్వడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. అందరికి కలిపి రూ.కోటి ముప్పై లక్షలు ఖర్చు చేశామని, ఒక్కరి ప్రాణమైనా దక్కుతుందని ఆశపడ్డామని, కానీ చివరకు నిరాశే మిగిలిందని కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు.
Read More:



