Andhra Pradesh: ఆ బంధం.. భర్తకు మరణ శాసనం.. హత్య చేయించి ఆపై అభాండాలు నెట్టి..

వివాహేతర బంధం.. వివాహ బంధానికి మరణ శాసనం రాసింది. మద్యానికి బానిసైన భర్త.. వేధింపులకు తోడు, ప్రియుడిపై ఉన్న మోజు వివాహ బాంధవ్యానికి శాశ్వతంగా

Andhra Pradesh: ఆ బంధం.. భర్తకు మరణ శాసనం.. హత్య చేయించి ఆపై అభాండాలు నెట్టి..
Illegal Affair
Follow us

|

Updated on: Nov 01, 2022 | 3:45 PM

వివాహేతర బంధం.. వివాహ బంధానికి మరణ శాసనం రాసింది. మద్యానికి బానిసైన భర్త.. వేధింపులకు తోడు, ప్రియుడిపై ఉన్న మోజు వివాహ బాంధవ్యానికి శాశ్వతంగా దూరం చేసింది. ప్రియుడితో భర్తను హత్య చేయించి.. ఆపై ఏమి ఎరగనట్టు నటించి.. చివరకు చేసిన తప్పును ఒప్పుకొని కటకటాల పాలయింది. అంతేకాదు.. ఆర్థిక సమస్యలు తీరాలంటే.. నగ్నంగా ఫోటోలు తీసి యూట్యూబ్లో పెట్టాలని భర్త చెప్పడంతోనే విసుగు చెంది నిర్ణయం తీసుకున్నట్టు పోలీసుల విచారణలో చెప్పింది. నమ్మకంగా ఉన్న వాడే ప్రాణాలు ఎలా తీశాడు..? భర్త హత్యకు ఆమె ప్లాన్ ఎలా చేసింది..?

విశాఖ నగరం న్యూ పోర్టు పోలీస్ స్టేషన్ పరిధిలోని.. వియ్యపు వానిపాలెం. తెల్లవారుజామున అందరూ వాకింగ్ కి వెళ్తున్నారు . ఇంతలో ఓ మృతదేహం అందరినీ కలవరపాటుకు గురిచేసింది. విషయం ఆనోట ఈ నోట పాకింది. పోలీసులకు సమాచారం అందింది. ఇంతలో భార్యకు విషయం తెలియడంతో.. భర్త మృతదేహాన్ని చూసిన ఆమె బోరున విలపించింది. పోలీసులు రంగంలోకి దిగారు. మృతదేహాన్ని మార్చురీకి తరలిస్తుండగా.. భర్తను తనకు అప్పజెప్పి అండి బాబు..! మార్చురీకి తీసుకెళ్తే నా భర్తను ముక్కలుగా కోసేస్తారు. నా ప్రాణమైన భర్త మృతదేహాన్ని అలా చేయొద్దు అంటూ వేడుకుంది భార్య. కట్ చేస్తే.. సీన్ సితార్. ఆ భార్య ఏడుపుల వెనుక ఉన్న కన్నింగ్ మెంటాలిటీ బయటపడింది. తనే భర్తను హత్య చేయించి ఆపై ఏమి ఎరగనట్టు నటిస్తున్నట్టు పోలీసుల ఇన్వెస్టిగేషన్లో తెలింది.

లారీ డ్రైవర్ తో వివాహం.. అతనితో..!

పెదగంట్యాడ వియ్యపు వాని పాలెంలో లారీ డ్రైవర్ అప్పారావు.. భార్య పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నాడు. మద్యానికి బానిసైనా అప్పారావు.. తన జీతభత్యాలను తాగుడుకే సరి పెట్టేసేవాడు. దీంతో ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు మొదలై.. భార్య ఉమ పనిలో చేరింది. సెక్యూరిటీ ఏజెన్సీ నడుపుతున్న వెంకటరెడ్డి తో ఉమ కు పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలోనే ఆమె భర్త అప్పారావు తోనూ పరిచయం పెంచుకొన్నారు. అలా క్రమంగా ఇంటికి వచ్చేవాడు వెంకటరెడ్డి.

ఇవి కూడా చదవండి

స్కెచ్ అలా..!

అప్పారావు ఇంట్లో పరిస్థితులు పూర్తిగా తెలుసుకున్న వెంకటరెడ్డి.. ఉమను ట్రాప్ చేసేసాడు. భర్త ఇంటి బాధ్యతలు పట్టించుకోవడంలేదని ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వెంకటరెడ్డికి చెప్పేది ఉమ. ఆర్థికపరమైన ఇబ్బందులతో బాధపడుతున్న ఆ కుటుంబానికి సాయపడేవాడు వెంకటరెడ్డి. దానికి తోడు తాగిన మైకంలో.. తనను తరచూ వేధిస్తున్నాడని చెప్పడంతో.. పాటు భర్తతో ఇక ఉండలేనని వెంకట రెడ్డికి చెప్పింది ఉమ. భర్త అప్పారావును అడ్డు తొలగించుకునేందుకు ఎలాగైనా అంతమొందించాలని సూచించింది. దీంతో ప్రియుడితో కలిసి భర్త హత్యకు ప్లాన్ చేసింది భార్య ఉమ.

శనివారం నాడు డ్యూటీ నుంచి ఇంటికి తిరిగి వచ్చిన అప్పారావు ను పనిమీద బయటకు పిలిపించాడు వెంకటరెడ్డి. విశాఖ నగరంలో సీసీ కెమెరాలు కొనుగోలు చేసి వాటిని ఇన్‌స్టాల్ కూడా చేసేసారు. పని ముగించుకున్నాక చిన్న గంట్యాడలోని ఓ బార్ లో.. వెంకట్ రెడ్డి, అప్పారావుతో పాటు సెక్యూరిటీ గార్డు సింహాచలం మద్యం తాగారు. ఆ తరువాత గాజువాక 80 ఫీట్ రోడ్ లోని వికేఆర్ టవర్స్ కు ముగ్గురు కలిసి వచ్చారు. అక్కడే సింహాచలం సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తుండటంతో ముగ్గురు కలిసి సెల్లార్లో కాసేపు గడిపారు. తాగిన మైకంలో ఉన్న అప్పారావును హత్య చేయాలని వెంకటరెడ్డి నిర్ణయించుకున్నాడు. కిటికీ చెక్కతో అప్పారావు తలపై మూడుసార్లు బలంగా మోదాడు వెంకటరెడ్డి. దాంతో అక్కడికి అక్కడే కుప్పకూలిపోయిన అప్పారావు ప్రాణాలు కోల్పోయాడు.

హత్య ఒకచోట.. డెడ్ బాడీ మరోచోట..!

అప్పారావు ప్రాణం పోయిందని నిర్ధారించుకున్న తర్వాత.. సింహాచలం సహకారంతో మోటార్ సైకిల్ పై మృతదేహాన్ని తరలించారు. వెయ్యబువానిపాలెం సులబ్ కాంప్లెక్స్ సర్వీస్ రోడ్డు వద్ద అర్ధరాత్రి పడేసి వెళ్లిపోయారు. జరిగిన విషయాలను ఎప్పటికప్పుడు ఉమకు ఫోన్లో చేరవేసేవాడు వెంకటరెడ్డి. ఆదివారం తెల్లవారేసరికి ఒక్కసారిగా మృతదేహం ఆ ప్రాంతంలో కలకలం రేపింది. విషయం తెలుసుకున్నట్టు నటిస్తూ భరత మృతదేహం వద్దకు చేరుకున్న ఉమా బోరున విలపించింది. భార్య వ్యవహార శైలిపై అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు.. ఆమె సెల్‌ఫోన్ కాల్ డేటా ఆధారంగా వెంకటరెడ్డిని ట్రాక్ చేశారు. దీంతో భర్త హత్యలో కీలక పాత్ర పోషించిన భార్య ఉమ వ్యవహారం వెలుగులో వచ్చింది. ఆమెను కూడా పట్టుకుని విచారించడంతో అసలు విషయం బయటపడింది. పోలీసుల విచారణలో వెంకటరెడ్డి, ఉమ.. తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. తొలుత తుప్పల్లో హత్య చేశామని నిందితులు చెప్పడంతో పోలీసులు అక్కడికి వెళ్లారు. హత్య జరిగిన ఆనవాళ్లు అక్కడ ఏవి పోలీసులకు కనిపించలేదు. దీంతో మరోసారి తమదైన స్టైల్ లో పోలీసులు విచారించారు ప్రశ్నించారు. చివరకు హత్య జరిగిన స్పాట్ ను చూపించారు నిందితులు. పూర్తి ఆధారాలను సేకరించిన పోలీసులు.. మృతుడు అప్పారావు భార్య ఉమ, ఆమె ప్రియుడు వెంకటరెడ్డి, మత దేహం తరలించేందుకు సహకరించిన సింహాచలంను అరెస్టు చేశారు పోలీసులు.

న్యూడ్ ఫోటోలు తీయమన్నందుకేనట..!

అయితే భర్తను అంతమొందించాలని ప్రియుడికి సూచించిన ఉమా.. పోలీసుల విచారణలో మరో అంశాన్ని బయటపెట్టింది. తన భర్త నాలుగు నెలలుగా ఇంటి అద్దె కట్టడం లేదని, తినడానికి బియ్యం కూడా తెచ్చేవాడు కాదని పోలీసులకు చెప్పింది. ఆర్థిక అవసరాలు తీరాలంటే న్యూడ్ ఫోటోలు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే.. డబ్బులు వస్తాయని భర్త అప్పారావు వేధించినట్టు పోలీసుల ముందు చెప్పుకొచ్చింది. వేధింపులకు తోడు అతని మాటలు సహించలేక ఈ నిర్ణయం తీసుకున్నట్టు పోలీసుల విసరణలో భార్య ఉమ చెప్పిందని అంటున్నారు సిఐ రాము.

ఘటన జరిగిన 24 గంటల వ్యవధిలోనే.. కేసును చేదించారు పోలీసులు. పోస్టుమార్టం కోసం డెడ్ బాడీని తరలిస్తున్న నేపథ్యంలో.. ఉమా వ్యవహార శైలి పోలీసులకు అనుమానం తెప్పించింది. హత్య కేసులో నిందితులను పట్టించింది. ప్రియుడు మోజులో పడిన ఉమా.. వేధిస్తున్నాడని సాకుతో కట్టుకున్న భర్తనే హత్య చేయించి మూడుముళ్ల బంధానికి మరణశాసనం రాసింది. చివరకు కటకటాల పాలైంది. మరోవైపు తండ్రి హత్యకు గురయ్యాడు.. తల్లి కటకటాల వెనక్కు వెళ్లడంతో.. వారి పిల్లలు అనాధలుగా మారారు.

– ఖాజా, విశాఖపట్నం

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!
కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!
శరీరంలో కనిపించే ఈ లక్షణాలు.. కిడ్నీల్లో రాళ్లకు సంకేతం కావొచ్చు.
శరీరంలో కనిపించే ఈ లక్షణాలు.. కిడ్నీల్లో రాళ్లకు సంకేతం కావొచ్చు.
బంగారం రా మా సాయి పల్లవి.. ఇంత మెచ్యురిటీ ఏంటమ్మా నీకు..
బంగారం రా మా సాయి పల్లవి.. ఇంత మెచ్యురిటీ ఏంటమ్మా నీకు..