Andhra Pradesh: గుడ్ న్యూస్.. విశాఖపట్నం నుంచి మరో 11 ప్రత్యేక రైళ్లు.. వివరాలు ఇవిగో..!
ఏపీ రైల్వే ప్రయాణీకులకు గుడ్ న్యూస్. గంగా పుష్కరాల యాత్రికుల కోసం విశాఖపట్నం నుంచి మరిన్ని ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి రానున్నాయి..
ఏపీ రైల్వే ప్రయాణీకులకు గుడ్ న్యూస్. గంగా పుష్కరాల యాత్రికుల కోసం విశాఖపట్నం నుంచి వారణాసికి ప్రత్యేక రైళ్లను ప్రకటించింది కేంద్ర రైల్వేశాఖ. ఇవి ఏప్రిల్ 19, 26 తేదీల్లో విశాఖ నుంచి బయల్దేరగా.. ఏప్రిల్ 20, 27 తేదీల్లో వారణాసి నుంచి తిరిగి వస్తాయి. వేసవి రద్దీని దృష్టిలో పెట్టుకుని విశాఖపట్నం-వారణాసి-విశాఖపట్నం మధ్య ప్రత్యేక రైళ్లను మేలో 9, జూన్‌లో 9 సర్వీసులను నడుపనున్నారు.
విశాఖపట్నం నుంచి ప్రతీ బుధవారం వారణాసికి రైలు బయల్దేరనుండగా.. అటు తిరుగు ప్రయాణంలో వారణాసి నుంచి ప్రతీ గురువారం విశాఖకు రైలు బయల్దేరుతుంది. కాగా, వాల్తేరు డివిజన్ ఈ రెండు రూట్ల మధ్య ప్రత్యేక రైళ్ల కోసం కొన్ని రోజుల క్రితం ప్రతిపాదించినప్పటికీ, బీజేపీ ఎంపీ జీవీఎల్ జోక్యంతో కేంద్ర రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ వీటిని వెంటనే కేటాయించారు.
అటు గంగా పుష్కరాలకు, వేసవి సెలవులకు వెళ్లే యాత్రికుల కోసం సకాలంలో విశాఖపట్నం నుంచి వారణాసికి ప్రత్యేక రైళ్ల మంజూరు చేయడంతో ఎంపీ జీవీఎల్.. కేంద్రమంత్రి అశ్విన్ వైష్ణవ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు.