Kiran Kumar Reddy: ‘నేను హైదరాబాద్‌లోనే పుట్టాను..’ మాజీ సీఎం నల్లారి ఆసక్తికర వ్యాఖ్యలు
విశాఖ స్టీల్ ప్లాంట్‌ని తెలంగాణకు విక్రయించడం లేదని ఇటీవల బీజేపీలో చేరిన మాజీ సీఎం నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ కింద 3500 కోట్లు ఎవరు పెట్టుబడి పెడతారో వారిని కేంద్రం బిడ్డింగ్‌కి పిలవడం జరిగిందన్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్‌ని తెలంగాణకు విక్రయించడం లేదని ఇటీవల బీజేపీలో చేరిన మాజీ సీఎం నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ కింద రూ.3,500 కోట్లు ఎవరు పెట్టుబడి పెడతారో వారిని కేంద్రం బిడ్డింగ్‌కి పిలవడం జరిగిందన్నారు. నష్టాల కారణంగా ఎయిరిండియాను విక్రయించినట్లు తెలిపిన నల్లారి.. అలాగే లాభాలు లేనందునే విశాఖ స్టీల్ ప్లాంట్‌ను అమ్ముతున్నట్లు వ్యాఖ్యానించారు. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన కిరణ్ కుమార్ రెడ్డి.. ఆంధ్రపదేశ్ విభజన సమయంలోనే కేంద్రం ఇచ్చిన విభజన హామీలు అమలు కావని చెప్పానని గుర్తుచేశారు. అందుకే తన సీఎం పదవికి రాజీనామా చేశానని తెలిపారు. కొత్త రాజధాని నిర్మించే నిధులు రావడం జరగదని ఆరోజే చెప్పానన్నారు.
తాను పదవి ఆశించి బీజేపీలో చేరలేదని కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. తనకు ఎవరు ఏ పదవి ఆశ చూపించలేదన్నారు. బీజేపీ పార్టీ చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు నచ్చి ఇందులో చేరానన్నారు. ఏపీలో బీజే బలోపేతం కోసం పనిచేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానన్నారు. తనను పార్టీ ఎలా ఉపయోగించుకుంటుందో చూడాలన్నారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నపుడు రాష్ట్రం లో ఎప్పుడు ఇలాంటి పరిస్థితులు చూడలేదని.. దాడులు చేసిన సంస్కృతి గతంలో లేదన్నారు. తాను ఏ ఒక్క రాజకీయ పార్టీని ఉద్దేశించి మాట్లాడడం లేదని.. అన్ని ప్రాంతీయ పార్టీలు ఒకేలా ఉన్నయన్నారు.
బీజేపీ ఏ స్టాండ్ తీసుకుంటే తనది కూడా అదే అదే స్టాండ్ అన్నారు కిరణ్ కుమార్ రెడ్డి. అమరావతి విషయంలో బీజేపీ నిర్ణయాలే తన నిర్ణయంగా పేర్కొన్నారు. తనకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు రెండూ ఒక్కటేనని అన్నారు. తాను హైదరాబాద్‌లోనే పుట్టానని.. తన జీవితమంతా అక్కడే గడిచిందని వ్యాఖ్యానించారు. ఆయన కామెంట్స్‌ను వీడియోలో చూడండి..
మరిన్ని ఏపీ వార్తలు చదవండి