AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Passenger Train: విశాఖ-రాయగడ ప్యాసింజర్‌ రైలుకు ప్రమాదం.. ఆరుగురు మృతి.. మృతులు పెరిగే అవకాశం

ఈ మధ్య కాలంలో రైలు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. పట్టాలు తప్పడం, ఢీకొనడం వంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఏపీలోని విశాఖ - రాయగడ ప్యాసింజర్‌ ప్యాసింజర్‌ రైలు పట్టాలు తప్పింది. అలమండ రైల్వే స్టేషన్‌ సమీపంలోని కంటకాపల్లి దగ్గర ఈ రైలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదం విజయనగరం జిల్లా కొత్తవలస మండలం కంటకాపల్లి వద్ద చోటు

Passenger Train: విశాఖ-రాయగడ ప్యాసింజర్‌ రైలుకు ప్రమాదం.. ఆరుగురు మృతి.. మృతులు పెరిగే అవకాశం
Train Accident
Subhash Goud
|

Updated on: Oct 29, 2023 | 9:03 PM

Share

ఈ మధ్య కాలంలో రైలు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. పట్టాలు తప్పడం, ఢీకొనడం వంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఏపీలోని విశాఖ – రాయగడ ప్యాసింజర్‌ ప్యాసింజర్‌ రైలు పట్టాలు తప్పింది. అలమండ రైల్వే స్టేషన్‌ సమీపంలోని కంటకాపల్లి దగ్గర ఈ రైలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదం విజయనగరం జిల్లా కొత్తవలస మండలం కంటకాపల్లి వద్ద చోటు చేసుకుంది. ఓవర్‌హెడ్‌ కేబుల్‌ తెగిపోవడంతో నిలిచిపోయిన ప్యాసింజర్‌ రైలును పలాస-విశాఖ రైలు ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో మూడు బోగిలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా, పలువురికి గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని హుటాహుటిన చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న రైల్వే సిబ్బంది, పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు సేకరిస్తున్నామని వాల్తేరు డీఆర్‌ఎం సౌరబ్‌ ప్రసాద్‌ టీవీ9తో తెలిపారు. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని అన్నారు.

అయితే ట్రైన్‌ ఇంజన్‌ నుంచి విడిపోయి నాలుగు బోగీలు పరస్పరం ఢీకొన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఘటన ప్రాంతంలో అంధకారం నెలకొనడంతో సహాయక చర్యలకు అటంకం ఏర్పడుతోందని వాల్తేరు డీఆర్‌ఎం తెలిపారు. పూర్తిగా చీకటిగా ఉండటంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. అయితే మృతుల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తోంది.

ఈ వార్త అప్‌డేట్‌లో ఉంది..

ప్రభాస్ లేకపోతే చనిపోయేవాడిని.. చత్రపతి శేఖర్ ఎమోషనల్..
ప్రభాస్ లేకపోతే చనిపోయేవాడిని.. చత్రపతి శేఖర్ ఎమోషనల్..
ధర ఎక్కువైనా ఈ పండును కచ్చితంగా తినండి.. ఎందుకో తెలిస్తే..
ధర ఎక్కువైనా ఈ పండును కచ్చితంగా తినండి.. ఎందుకో తెలిస్తే..
సిమ్ కార్డులతో భారీ సైబర్ క్రైమ్.. చెక్‌ పెట్టిన ఏపీ సీఐడి!
సిమ్ కార్డులతో భారీ సైబర్ క్రైమ్.. చెక్‌ పెట్టిన ఏపీ సీఐడి!
విజయ్ హజారే ట్రోఫీకి విరాట్, రోహిత్ శాలరీ ఎంత?
విజయ్ హజారే ట్రోఫీకి విరాట్, రోహిత్ శాలరీ ఎంత?
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..