Viral: మేఘాల్లో మీటింగ్  ప్లేస్ ఎక్కడుందో తెలుసా.? అద్భుతంగా ఆంధ్ర కాశ్మీర్..

Viral: మేఘాల్లో మీటింగ్ ప్లేస్ ఎక్కడుందో తెలుసా.? అద్భుతంగా ఆంధ్ర కాశ్మీర్..

Anil kumar poka

|

Updated on: Oct 29, 2023 | 7:42 PM

అల్లూరి జిల్లా ఏజెన్సీలో ప్రాంతాల్లో పర్యాటకుల సందడి నెలకొంది. మన్యం అందాలను చూసేందుకు భారీ సంఖ్యలో పర్యాటకులు తరలి వస్తున్నారు. ఏజెన్సీలోని మేఘాల కొండగా పేరు పొందిన పాడేరు మండలం వంజంగి కొండపై పర్యాటకుల తాకిడి నెలకొంది. ఏజెన్సీలో దట్టమైన పొగమంచు కురుస్తోంది. గిరి శిఖరాలను తాకుతూ అలుముకున్న దట్టమైన పొగమంచు అందాలను వీక్షించడానికి తెలుగు రాష్ట్రాలతో పాటు..

అల్లూరి జిల్లా ఏజెన్సీలో ప్రాంతాల్లో పర్యాటకుల సందడి నెలకొంది. మన్యం అందాలను చూసేందుకు భారీ సంఖ్యలో పర్యాటకులు తరలి వస్తున్నారు. ఏజెన్సీలోని మేఘాల కొండగా పేరు పొందిన పాడేరు మండలం వంజంగి కొండపై పర్యాటకుల తాకిడి నెలకొంది. ఏజెన్సీలో దట్టమైన పొగమంచు కురుస్తోంది. గిరి శిఖరాలను తాకుతూ అలుముకున్న దట్టమైన పొగమంచు అందాలను వీక్షించడానికి తెలుగు రాష్ట్రాలతో పాటు.. వివిధ ప్రాంతాల నుంచి టూరిస్టులు చేరుకుంటున్నారు. తెల్లవారు జామున కురిసే దట్టమైన మంచుకి గిరి శిఖరాలు పాల సముద్రాన్ని తలపిస్తున్నాయి. దీంతో వంజంగి మేఘాల కొండకు చేరుకుని పర్యాటకులు మంచు అందాలను తమ కెమెరాలలో బంధిస్తున్నారు. సూర్యోదయం వేళ అక్కడి ప్రకృతి అందాలకు వారంతా ఫిదా అవుతున్నారు. సెల్ఫీలతో సందడి చేస్తున్నారు. పచ్చని కొండల మధ్య తేలియాడే పాల సముద్రం లాంటి మేఘాల సమూహాన్ని ఆస్వాదిస్తున్నారు. ఉషోదయాన మంచుకొండలమీదుగా వీచే చల్లని గాలి.. ఆహ్లాదం కలిగించే వాతావరణం అద్భుతంగా ఉందని.. పర్యాటకులు చెబుతున్నారు. ఏజెన్సీకి పర్యాటకులు తాకిడి పెరగడంతో చిరువ్యాపారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..