AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Visakhapatnam: రౌడీ షీటర్‌ను చంపిన కేసులో విశాఖ కోర్టు సంచలన తీర్పు.. అసలేం జరిగిందో తెలుసా..?

విశాఖపట్నంలోని ఎస్సీ ఎస్టీ ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఓ రౌడీ షీటర్ హత్య కేసులో.. మరో ముగ్గురు రౌడీషీటర్లకు జీవిత ఖైదు విధిస్తూ తీర్పును వెల్లడించింది. శిక్షతోపాటు 2వేల జరిమానా కూడా చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. జరిమానా చెల్లించని పక్షంలో మరో ఆరునెలల జైలు శిక్ష అనుభవించాలని న్యాయస్థానం ఆదేశించింది.. కేసు వివరాలను పరిశీలిస్తే..

Visakhapatnam: రౌడీ షీటర్‌ను చంపిన కేసులో విశాఖ కోర్టు సంచలన తీర్పు.. అసలేం జరిగిందో తెలుసా..?
Vizag Police
Maqdood Husain Khaja
| Edited By: Shaik Madar Saheb|

Updated on: Nov 09, 2023 | 8:49 AM

Share

విశాఖపట్నంలోని ఎస్సీ ఎస్టీ ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఓ రౌడీ షీటర్ హత్య కేసులో.. మరో ముగ్గురు రౌడీషీటర్లకు జీవిత ఖైదు విధిస్తూ తీర్పును వెల్లడించింది. శిక్షతోపాటు 2వేల జరిమానా కూడా చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. జరిమానా చెల్లించని పక్షంలో మరో ఆరునెలల జైలు శిక్ష అనుభవించాలని న్యాయస్థానం ఆదేశించింది.. కేసు వివరాలను పరిశీలిస్తే.. ఆరిలోవ ప్రాంతానికి చెందిన కారు డ్రైవర్ పందిరి రవి అలియాస్ చింత రవి రౌడీ షీటర్… రాఘవరాజు, సాయికుమార్, అప్పలరాజు, సంపత్, నాగూర్, శివ, అమర్ స్నేహితులు. వారిపై పలు కేసులు కూడా ఉన్నాయి. వేర్వేరు సందర్భల్లో రవికుమార్ వీరిని కొట్టడం, వివాదాల నేపథ్యంలో కక్ష పెంచుకున్నారు. రవికుమార్ ను అంతమోందించాలని నిర్ణయించుకున్నారు.

ఆ రోజు.. ఇంటి నుంచి పిలిచి..

2011 జూన్ 12న.. ఇంట్లో ఉన్న రవికుమార్ ను రాఘవరాజు బయటికి పిలిచాడు. అప్పటికె ప్లాన్ చేసుకున్న మిగిలిన వాళ్ళంతా కాపు కాశారు. బయటకు వఛ్చిన రవికుమార్ పై దాడి చేసి చంపేశారు. దీంతో ఏడుగురుపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేశారు ఆరిలోవ పోలీసులు. నిందితులపై పై రౌడీ షీటర్ కూడా నమోదుచేశారు. దర్యాప్తు తర్వాత పోలీసులు కోర్టులో చార్జ్ షిట్ దాఖలు చేశారు. స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ బివిఆర్ మూర్తి ప్రత్యేకంగా ఈ కేసును వాదించారు. నేరం రుజువు కావడంతో ఏ 3 అప్పలరాజు అలియాస్ తార్పాలు, ఏ 6 వాసుపల్లి శివ అలియాస్ దేముడు, ఏ 7 ముద్దాన అమర్నాథ్ అలియాస్ అమర్ లకు కోర్టు జీవిత ఖైదు విధించింది. ఏ 1 గా ఉన్న తిరుమల రాఘవరావు అలియాస్ టింకు ఈ ఘటన జరిగినప్పటి నుంచి పరారీలో ఉన్నాడు. ఏ 2 కోరడ సాయి, ఏ 4 వినయ్ సంపత్ అలియాస్ వినయ్, ఏ 5 షేక్ నాగూర్ మృతి చెందారు.

హత్య కేసులో తీర్పును వెల్లడించిన న్యాయస్థానం.. ముగ్గురు రౌడీ షీటర్లకు జీవిత ఖైదు విధించింది. అయితే, ఈ కేసు రౌడీషీటర్లకు కనువిప్పు కలుగుతుందని డిసిపి శ్రీనివాసరావు పేర్కొన్నారు. రౌడీ షీటర్ లు తమ పద్ధతి మార్చుకోకుంటే కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరించారు. కాగా.. ఈ కేసులో శిక్షపడేలా వాదించిన స్పెషల్ పిపి బివిఆర్ మూర్తిని.. డిసిపి, పోలీసులను సీపీ అభినందించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఫ్యాన్సీ డ్రెస్ పోటీ.. బుర్జ్ ఖలీఫా వేషంలో అదరగొట్టిన బుడ్డొడు..
ఫ్యాన్సీ డ్రెస్ పోటీ.. బుర్జ్ ఖలీఫా వేషంలో అదరగొట్టిన బుడ్డొడు..
బిగ్‌ అలర్ట్‌.. జనవరి నుంచి ఈ పాన్‌ కార్డులు చెల్లవు.. ఎలా మరి?
బిగ్‌ అలర్ట్‌.. జనవరి నుంచి ఈ పాన్‌ కార్డులు చెల్లవు.. ఎలా మరి?
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...