AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijayawada: విజయవాడ సబ్‌ జైలు.. ఎటు చూసినా వీఐపీలు

 మొన్నటివరకు అదొక సాదాసీదా జైలు. చిన్నచిన్న నేరాలు చేసేవారిని.. సామాన్యులను ఆ జైల్లో పెట్టేవారు. కానీ ఇప్పుడు సీన్ మారింది. విజయవాడ సబ్‌జైలుకు వీఐపీల తాకిడి పెరిగింది. ఒకప్పుడు రాజకీయంగా వెలుగు వెలిగిన వారు.. అధికార యంత్రాంగాన్ని అంతా కంట్రోల్ చేసినవారు ఆ జైల్లో ఉంటున్నారు. 

Vijayawada: విజయవాడ సబ్‌ జైలు.. ఎటు చూసినా వీఐపీలు
Vijayawada Jail
Ram Naramaneni
|

Updated on: May 18, 2025 | 7:55 PM

Share

ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు నెలల క్రితం వరకు రాజమండ్రి సెంట్రల్ జైలే ఫేమస్.. కానీ ఇప్పుడు విజయవాడ సబ్‌ జైలు చాలా ఫేమస్ అయింది. కీలక కేసుల్లో నిందుతలంతా ఈ సబ్‌ జైలులోనే ఉన్నారు.

వైసీపీ ప్రభుత్వంలో కృష్ణాజిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన వల్లభేనేని వంశీ మూడు నెలలుగా విజయవాడ జైలులోనే ఉన్నారు. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసు, టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో బెయిల్ వచ్చినప్పటికీ భూ కబ్జా కేసులో జైలు జీవితం గడుపుతున్నారు వంశీ.

లిక్కర్ కేసులో అరెస్ట్‌ అయిన ఏడుగురు విజయవాడ కారాగారంలోనే ఉన్నారు. మాజీ సీఎం జగన్ పేషీలో కీలకంగా వ్యవహరించిన ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి ఈ జైల్లోనే ఉన్నారు. ఇదే కేసులో బాలాజీ గోవిందప్ప, కేసీరెడ్డి రాజశేఖర్‌ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, దిలీప్, చాణక్య ఇదే జైలులో ఉన్నారు.

ఏపీపీఎస్సీ గ్రూపు-1 పరీక్షా పత్రాల డిజిటల్ కరెక్షన్ కేసులో అరెస్ట్ అయిన ఐపీఎస్‌ అధికారి పీఎస్‌ఆర్ ఆంజనేయులు కూడా ఇదే జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. వీరితో ములాఖత్ అయ్యేందుకు విజయవాడ సబ్‌ జైలుకు వీఐపీల తాకిడి పెరగడంతో భద్రత కట్టుదిట్టం చేశారు జైలు అధికారులు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్