AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అయ్యో దేవుడా.. మాయదారి కారు ఎక్కకపోయినా బాగుండేది.. పాపం నలుగురు చిన్నారులు..

అప్పటివరకు కళ్ల ముందే ఆడుకుంటున్నారు.. సంతోషంగా గెంతులేస్తున్నారు.. ఈ క్రమంలోనే.. మాయదారి కారు ఎక్కకపోయినా బాగుండేది.. నాలుగు ప్రాణాలు దక్కేవి.. సరదాగా.. ఆగివున్న కారులో ఆడుకునేందుకు వెళ్లి నలుగురు చిన్నారులు చనిపోయారు.. చిన్నారులు ఆడుకుంటుండగా.. ఆటోమెటిక్‌గా డోర్‌లాక్‌ పడి పోవడంతో ఊపిరి ఆడక చిన్నారులు కన్నుమూశారు..

అయ్యో దేవుడా.. మాయదారి కారు ఎక్కకపోయినా బాగుండేది.. పాపం నలుగురు చిన్నారులు..
Andhra Car Tragedy
Shaik Madar Saheb
|

Updated on: May 18, 2025 | 7:41 PM

Share

అప్పటివరకు కళ్ల ముందే ఆడుకుంటున్నారు.. సంతోషంగా గెంతులేస్తున్నారు.. ఈ క్రమంలోనే.. మాయదారి కారు ఎక్కకపోయినా బాగుండేది.. నాలుగు ప్రాణాలు దక్కేవి.. సరదాగా.. ఆగివున్న కారులో ఆడుకునేందుకు వెళ్లి నలుగురు చిన్నారులు చనిపోయారు.. చిన్నారులు ఆడుకుంటుండగా.. ఆటోమెటిక్‌గా డోర్‌లాక్‌ పడి పోవడంతో ఊపిరి ఆడక చిన్నారులు విలవిలలాడుతూ కన్నుమూశారు.. ఈ విషాదకర ఘటన ఆంధ్రప్రదేశ్ విజయనగరం కంటోన్మెంట్‌ పరిధిలోని ద్వారపూడి గ్రామంలో చోటుచేసుకుంది. కారు లాక్‌ పడటంలో అందులో చిక్కుకున్న నలుగురు చిన్నారులు.. ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు.

గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. నలుగురు చిన్నారులు ఆదివారం ఉదయం ఆడుకునేందుకు బయటకు వెళ్లారు.. ఆ తర్వాత ఎంతసేపైనా తిరిగి రాలేదు. దీంతో వారి తల్లిదండ్రులు ఆందోళన చెందారు.. ఎంత వెతికినా వారు కనిపించలేదు. చివరికి స్థానిక మహిళా మండలి కార్యాలయం వద్ద.. ఆగి ఉన్న కారులో పరిశీలించారు.. దానిలో నలుగురు చిన్నారులు విగత జీవులుగా కనిపించారు. ఆ తర్వాత చిన్నారులను కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే.. చిన్నారులు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.. మృతులను ఉదయ్‌ (8), చారుమతి (8), చరిష్మా (6), మనస్విగా గుర్తించారు. వీరిలో చారుమతి, చరిష్మా అక్కాచెల్లెళ్లని స్థానికులు తెలిపారు.

కాగా.. గ్రామంలో ఒకేసారి నలుగురు పిల్లలు చనిపోవడంతో ద్వారపూడిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. చిన్నారుల తల్లిదండ్రులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్