AP News: మిద్దె తవ్వుతుండగా బయటపడ్డ 350 గ్రాముల బంగారు బిస్కెట్.. ! మ్యాటర్ ట్విస్ట్ ఇదే
మోసం రోజువారి కూలీ పనులు చేసేవాళ్లం. మాకు ఓ ఇంటిని కూలుస్తుంటే పెద్ద బంగారు బిస్కెట్ దొరికింది. అది మీకు తక్కువ రేటులో ఇస్తాం. కావాలంటే ఈ ముక్క తీసుకుని వెళ్లి.. టెస్ట్ చేసుకుంది. అసలు బంగారం అనుకుంటేనే డబ్బులు ఇవ్వండి అన్నారు. ఆ తర్వాత...
అన్నమయ్య జిల్లా రాజంపేట సరొకొత్త మోసం వెలుగుచూసింది. మాయమాటలు చెప్పి నకిలీ బంగారంతో బురిడీ కొట్టించారు మోసగాళ్లు. ఇంటి నిర్మాణం కోసం తవ్వకాలు జరుపుతుంటే.. బంగారం బిస్కెట్, వెండి నాణేలు దొరికాయని.. వాటిని తక్కువ ధర ఇస్తామని నమ్మబలికారు. డౌట్ ఉంటే చిన్న ముక్క ఇస్తామని… బంగారం నాణ్యత కూడా పరీక్షించున్న తర్వాతే డబ్బు ఇవ్వాలన్నారు. బాధితులు ఆ ముక్క తీసుకెళ్లి పరీక్షించగా ఒరిజినల్ బంగారం అని తేలింది. దీంతో నమ్మకం కుదిరింది. 350 గ్రాముల బంగారు బిస్కెట్ రూ. 8 లక్షలకే ఇస్తామన్నారు మోసగాళ్లు. చివరకు 5 లక్షలకు బేరం తెగింది. అయితే కేటుగాళ్లు నకిలీ బిస్కెట్ ఇచ్చి 5 లక్షలతో ఎస్కేప్ అయ్యారు. వారు వెళ్లిన తర్వాత.. కొన్నాళ్లకు ఆ బంగారం పరీక్షించగా అది ఇత్తడిది అని తేలింది. మోసపోయినట్టు గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన రాజంపేట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..