Vijayawada: ఇద్దరమ్మాయిలు.. ఇద్దరబ్బాయిలు.. బెజవాడలో లగ్జరీ కార్ల రేసింగ్.. బైక్‌లపై వెళ్తున్న వారిని ఢీకొట్టి..
లగ్జరీ కార్ల రేసింగ్ యువకుల ప్రాణాలమీదకు వచ్చింది. బెజవాడలో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. బెంజి సర్కిల్ ఎగ్జిక్యూటివ్ క్లబ్ జంక్షన్‌లో వేగంగా వచ్చిన రెండు కార్లు.. పలు బైక్‌లను ఢీ కొన్నాయి.

విజయవాడ, నవంబర్ 19: లగ్జరీ కార్ల రేసింగ్ యువకుల ప్రాణాలమీదకు వచ్చింది. బెజవాడలో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. బెంజి సర్కిల్ ఎగ్జిక్యూటివ్ క్లబ్ జంక్షన్‌లో వేగంగా వచ్చిన రెండు కార్లు.. పలు బైక్‌లను ఢీ కొన్నాయి. ఈ ఘటనలో నలుగురు గాల్లోకి ఎగిరిపడ్డారు. నలుగురు వ్యక్తులకు తీవ్ర గాయాలు కాగా.. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు, స్థానికులు స్పందించి.. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
బెంజ్, ఫార్చునర్ కార్ల రేసింగే ఈ ఘటనకు కారణమని పోలీసులు తెలిపారు. నిందితులు కారు రేస్ పెట్టుకుని వేగంగా నడిపారు. ఈ క్రమంలో ఫార్చునర్ కారు రెండు బైక్‌లను ఢీకొంది. బైక్స్‌పై ఉన్న నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.
బెంజి సర్కిల్ నుంచి రమవరప్పాడు వెళ్తూ రేసింగ్ పెట్టుకున్నట్లు పేర్కొంటున్నారు. యాక్సిడెంట్ చేసిన కారులో ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నారు. ప్రమాదం జరగటంతో నిందితులు ఫార్చునర్ అక్కడే వదిలేసి బెంజ్ కారులో పరారయ్యారు. ఫుల్‌గా తాగేసి యాక్సిడెంట్స్ చేశారంటూ బాధిత కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..