Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో ఏసీబీ దాడుల టెన్షన్.. ఒక్క నెలలో ఎన్ని కేసులు నమోదయ్యాయో తెలుసా..?
ACB Raids In Andhra Pradesh: ఏపీలో వరుసగా ఏసీబీ సోదాలు జరుగుతున్నాయి. కోట్లలో అక్రమ ఆస్తిని గుర్తించారు అధికారులు. కాకినాడ, నంద్యాల, ఎన్టీఆర్ జిల్లాల్లో ఏసీబీకి అవినీతి తిమింగలాలు పట్టుబడ్డాయి.

ACB Raids In Andhra Pradesh: ఏపీలో వరుసగా ఏసీబీ సోదాలు జరుగుతున్నాయి. కోట్లలో అక్రమ ఆస్తిని గుర్తించారు అధికారులు. కాకినాడ, నంద్యాల, ఎన్టీఆర్ జిల్లాల్లో ఏసీబీకి అవినీతి తిమింగలాలు పట్టుబడ్డాయి. రవాణాశాఖకు చెందిన AO, MVI, మైన్స్ అండ్ జియాలజీ శాఖకు చెందిన జీయాలజిస్ట్ , ఇబ్రహింపట్నం సబ్ రిజిస్ట్రార్ తో పాటు రెవిన్యూ ఇన్స్పెక్టర్ ను పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. ఈ ఒక్క నెలలోనే 22 కేసులు నమోదు కాగా.. ఈ ఏడాది ఇప్పటి వరకు 146 కేసులు నమోదు చేశారు ఏసీబీ అధికారులు. ఈలెక్క ఏపీ రవాణాశాఖలో కలకలం రేపుతుంది.
ఏసీబీకి హోమ్ గార్డ్ నుండి హాయర్ ఆఫిషియల్ ఉద్యోగులు వరకూ పట్టుబడ్డారు. కోట్లలో ఆదాయానికి మించిన ఆస్తి సంపాదించినట్లు గుర్తించారు. ఇదే క్రమంలో ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ బాలనాగ ధర్మ సింగ్.. ఇంట్లో అధికారులు తనిఖీలు చేశారు. రెయిడ్స్‌కు వెళ్లిన సమయంలో ఆయన కళ్లుగప్పి పారిపోయాడు. భారీగా అక్రమ ఆస్తులు స్వాధీనం చేసుకున్నారు. ఈయన ఆస్తుల్లో బంధువులు, స్నేహితులు భినామీలుగా ఉన్నట్లు గుర్తించారు అధికారులు. ఆయనకు గొల్లపూడిలో 249 స్క్వేర్ యార్డ్స్ ఇళ్ళు.. బాపట్ల మరో ఇళ్లు, విజయవాడలో 202 స్క్వేర్ యార్డ్స్ లో ఓపెన్ ప్లాట్, అలాగే మరో మూడు ప్లాట్స్.. అలాగే హైదరాబాద్‌లోని kphbలో నర్సింగ్ లో ప్లాట్స్‌తో పాటు.. ఇబ్రహీంపట్నంలో రెండు కమర్షిల్ కాంప్లెక్స్ ఉన్నట్లు గుర్తించారు ఏసీబీ అధికారులు.
వీడియో చూడండి..
మరోవైపు కాకినాడ జిల్లా సామర్లకోట రెవిన్యూ ఇన్స్పెక్టర్ దుర్గాబాలాజీ రమణమూర్తి ఏసీబీ వలకు చిక్కాడు. సుబ్బయ్య హోటల్ సమీపంలో 8వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా రమణమూర్తి పట్టుకున్నారు. అటు నంద్యాల రవాణా శాఖ AO సువర్ణకుమారి ఆదాయానికి మించి ఆస్తులు పై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ధనలక్ష్మి నగర్ లోని ఆమె ఇంట్లో రూ.10 లక్షల నగదు, 500 గ్రాముల బంగారు, 700 గ్రాముల వెండి, 9 ప్లాట్లను సీజ్ చేశారు. బ్యాంక్ అకౌంట్లు, లాకర్లు, RTA ఏజంట్ల వాటిపై విచారణ చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..