Pawan Kalyan: ఏపీలో కాపులు పెద్దన్న పాత్ర పోషించాలి .. హక్కుల కంటే ఐకమత్యం గొప్పదన్న జనసేనాని
ఆంధ్రప్రదేశ్ లో కాపు నాయకులు సమాజంలో పెద్దన్న పాత్ర పోషించాలని, బీసీలు, దళితులను కలుపుకొని పోవాలని జననసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. కాపులు ఒక్కళ్ల వల్ల సమాజం నడవదని స్పష్టం చేశారు.

మంగళగిరిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు కాపు సంక్షేమ సేన ప్రజాప్రతినిధులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ పలు అంశాలను వెల్లడించారు. జనసేన ఇండిపెండెంట్ పార్టీ అని.. ఎవరి అజెండా కోసం పని చెయ్యదని స్పష్టం చేశారు. అంతేకాదు తాను ఎవ్వరికీ అమ్ముడు పోలేదని.. ప్రతికూల పవనాల్లో ఎదురైనా దైర్యంగా పార్టీనీ నడుపుతున్నానని తెలిపారు. తాను కులం ప్రాతిపదికన మాట్లాడితే రెండు చోట్ల ఓడేవాడిని కాదని తెలిపారు జనసేనాని. అంతేకాదు ఒక వ్యక్తి తాలూకా బలం ప్రతికూల పరిస్థితుల్లో బయట పడుతుందన్నారు.
ఆంధ్రప్రదేశ్ లో కాపు నాయకులు సమాజంలో పెద్దన్న పాత్ర పోషించాలని, బీసీలు, దళితులను కలుపుకొని పోవాలని జననసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. కాపులు ఒక్కళ్ల వల్ల సమాజం నడవదని స్పష్టం చేశారు. కాపులు పెదన్న పాత్ర పోషిస్తే ఇప్పుడున్న సీఎం వెళ్ళిపోతాడన్నారు. అసలు ఎన్నికల్లో డబ్బులు తీసుకుని ఓటు వేయడం సమాజానికి మంచిది కాదన్నారు. మీరు తళతళలాడే 2వేల రూపాయల నోటు తీసుకోవాలంటే.. అక్కడ తీసుకుని జనసేనకు ఓటు వేయమంటూ చెప్పారు.
తాను అన్నిటికీ సిద్ధపడి రాజకీయాల్లోకి వచ్చానని.. ఎవరి బెదిరింపులకు తాను భయపడనన్నారు. వైసీపీ నాయకులు నన్ను చంపేస్తామని బెదిరించారని పవన్ చెప్పారు. మరణించిన తర్వాత రంగా గారి పేరు పెట్టండి అని అడుగుతున్నారు.. అసలు ఆయన బతికి ఉన్న సమయంలోనే జనం ఆయన వెంట ఉంటే.. అలా మరణించేవారు కాదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు జనసేనాని.




2024 ఎన్నికలు చాలా కీలకమని.. పార్టీ గెలుపుకోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. తాను ఎవరికీ పార్టీ నడపడానికి విరాళాలు అడగలేదని ..ఇష్టం మై కొంత మంది ఇచ్చారని తెలిపారు జనసేనాని. తన సొంత డబ్బు తో పార్టీని నడుపుతున్నానని.. నన్ను నమ్మండి.. మిమల్ని తలెత్తుకునేలా చేస్తానన్నారు పవన్ కళ్యాణ్.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




