టూరిజం అభివృద్ధిలో గేమ్ చేంజర్.. విశాఖలో క్రూయిజ్ టెర్మినల్‌ను ప్రారంభించిన కేంద్ర మంత్రి సర్బానంద్ సోనోవాల్..

Boosting International Tourism: ఏడాది క్రితం అంతర్జాతీయ ప్రసిద్ధ కార్డిలియా క్రూయిజ్ సంస్థ విశాఖ నుంచి చెన్నై కు పాండీచ్చేరి మీదుగా అత్యంత విలావంతమైన క్రూయిజ్ లను నడిపింది. ఆ సమయంలో టెర్మినల్ లేక, సరైన వసతులు లేక, పార్కింగ్ లేక అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. దీంతో తొలిసారిగా తూర్పు తీర ప్రాంతంలో విశాఖ లో 100 కోట్ల వ్యయంతో క్రూయిజ్ టెర్మినల్ ను నిర్మించాలని తలపెట్టింది. ఏడాది కాలం తీసుకుని నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ టెర్మినల్ ను నేడు కేంద్ర పోర్టులు, షిప్పింగ్‌ శాఖ మంత్రి శర్బానంద సోనోవాల్‌ ప్రారంభించారు.

టూరిజం అభివృద్ధిలో గేమ్ చేంజర్.. విశాఖలో క్రూయిజ్ టెర్మినల్‌ను ప్రారంభించిన కేంద్ర మంత్రి సర్బానంద్ సోనోవాల్..
Vizag International Cruise Terminal
Follow us
Eswar Chennupalli

| Edited By: Sanjay Kasula

Updated on: Sep 04, 2023 | 12:14 PM

విశాఖపట్నం, సెప్టెంబర్ 04: తూర్పు తీర ప్రాంతం విశాఖ లో కేంద్ర షిప్పింగ్, పోర్ట్స్ మంత్రిత్వ శాఖ తో పాటు టూరిజం శాఖ సంయుక్త సహకారం తో నూతనంగా నిర్మించిన క్రూయిజ్ టెర్మినల్ ను కేంద్ర మంత్రి సర్బానంద్ సోనోవాల్ ప్రారంభించారు. సుమారు 100 కోట్ల రూపాయల నిధులతో అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ టెర్మినల్ ను ఏడాది కాలంలో నిర్మించారు. ఇప్పటికే పోర్ట్ కార్యకలాపాల్లో అగ్రగామిగా ఉన్న విశాఖ పోర్ట్ ఇక పై క్రూయిజ్ పర్యాటకులకూ సేవలందించనుంది.

ఏడాది క్రితం అంతర్జాతీయ ప్రసిద్ధ కార్డిలియా క్రూయిజ్ సంస్థ విశాఖ నుంచి చెన్నై కు పాండీచ్చేరి మీదుగా అత్యంత విలావంతమైన క్రూయిజ్ లను నడిపింది. ఆ సమయంలో టెర్మినల్ లేక, సరైన వసతులు లేక, పార్కింగ్ లేక అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. దీంతో తొలిసారిగా తూర్పు తీర ప్రాంతంలో విశాఖ లో 100 కోట్ల వ్యయంతో క్రూయిజ్ టెర్మినల్ ను నిర్మించాలని తలపెట్టింది. ఏడాది కాలం తీసుకుని నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ టెర్మినల్ ను నేడు కేంద్ర పోర్టులు, షిప్పింగ్‌ శాఖ మంత్రి శర్బానంద సోనోవాల్‌ ప్రారంభించారు.

ఈ టెర్మినల్ నిర్మాణంతో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖ నగర ప్రతిష్ట మరింత పెరగనుంది. అంతర్జాతీయ విమానాశ్రయం కూడా ఉండడంతో వివిధ దేశాల పర్యాటకులు క్రూయిజ్‌లో వచ్చి విశాఖ నగరంలో పర్యటించే అవకాశం ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని క్రూయిజ్ టెర్మినల్‌లో అన్ని ఏర్పాట్లు చేశారు. పోర్టులోని గ్రీన్‌ చానల్‌ బెర్త్‌లో 100 కోట్లతో నిర్మించిన ఈ క్రూయిజ్ టెర్మినల్ లో క్రూయిజ్‌ షిప్స్‌తోపాటు భారీ కార్గో నౌకల హ్యాండ్లింగ్‌కు అనుగుణంగా తీర్చిదిద్దారు. .

విశాఖ లో క్రూయిజ్ టెర్మినల్ నిర్మించాలన్నది సుదీర్ఘ కాలం నుంచి జరుగుతున్న ప్రయత్నం. విశాఖ మంచి క్రూయిజ్‌ టూరిజానికి పుష్కలంగా అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర టూరిజం శాఖ సమన్వయం తో ఈ టెర్మినల్ నిర్మితమైంది.

విశాఖ లో నిర్మించిన క్రూయిజ్ టెర్మినల్ ప్రత్యేకతలు ఇవే..

  • ఒక్కసారిగా 2000 మంది పర్యాటకులకు సేవలందించే విధంగా 2,500 చదరపు మీటర్లతో టెర్మినల్‌ బిల్డింగ్, అడ్మినిస్ట్రేటివ్‌ బిల్డింగ్, ఫారిన్ ఎక్సేంజ్ కరెన్సీ కౌంటర్‌, గ్యాంగ్‌ వే, రెస్టారెంట్, స్పెషల్‌ లాంజ్, షాపింగ్, రెస్ట్‌ రూమ్స్, టూరిజం ఆపరేటర్స్‌ కౌంటర్లు ఏర్పాటు చేసే విధంగా నిర్మాణం
  • క్రూయిజ్‌లో ప్రయాణించే అంతర్జాతీయ పర్యాటకుల తనిఖీల నిమిత్తం ప్రత్యేకంగా ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్‌ క్యాబిన్స్, పర్యాటకులు సేదతీరేందుకు టూరిస్ట్‌ లాంజ్‌ లు.0
  • టెర్మినల్‌ పార్కింగ్‌ ప్రాంతంలో 7 బస్సులు, 70 కార్లు, 40 బైక్‌ల పార్కింగ్ కు అవసరమైన ఏర్పాట్లు
  • గంటకు 200 కిలోమీటర్ల వేగంతో వీచే బలమైన గాలులను సైతం తట్టుకునేలా షోర్‌ ప్రొటెక్షన్‌ వాల్‌ కూడా ఇందులో నిర్మిస్తున్నారు.
  • సాధారణంగా రెగ్యులర్‌ బెర్త్‌ 180 మీటర్ల పొడవు కాగా, ఈ టెర్మినల్‌లో 330 మీటర్ల భారీ పొడవైన క్రూయిజ్‌ బెర్త్‌ నిర్మాణం.
  • 15 మీటర్ల వెడల్పు, 9.50 మీటర్ల డ్రెడ్జ్‌ డెప్త్‌ తో బెర్త్ నిర్మాణం
  • అందువల్ల క్రూయిజ్‌ రాని సమయంలో సరుకు రవాణా చేసే భారీ కార్గో నౌకలను కూడా ఈ బెర్త్‌లోకి అనుమతించేలా డిజైన్‌

క్రూయిజ్ టూరిజం కు విస్తారమైన అవకాశం..

దేశంలో ప్రస్తుతం క్రూయిజ్ టూరిజం కు విస్తృత అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం 7.1 యూఎస్‌ బిలియన్‌ డాలర్ల మార్కెట్‌ ఉందనీ ఒక అంచనా. వచ్చే పదేళ్లలో ఇది 12.1 బిలియన్‌ డాలర్లకు పెరుగుతుందని అంచనా. ప్రపంచవ్యాప్తంగా క్రూయిజ్‌ రంగం 1.17 మిలియన్ల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించగా దేశంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లోనూ ఈ రంగంలో ఉపాధి అవకాశాలు పెరిగేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నది ఒక నివేదిక.

రాష్ట్రంలోని తీర ప్రాంతాల్లో అద్భుతమైన సందర్శనీయ ప్రాంతాలు ఉన్నాయి, క్రూయిజ్‌ సేవలు ప్రారంభమైతే రాష్ట్రంలో ఇంటర్నేషనల్‌ టూరిజం గణనీయంగా పెరిగే అవకాశాలు ఉన్నాయన్న నేపధ్యంలోనే కేంద్ర టూరిజం శాఖా మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి శరవేగంగా ఈ నిర్మాణాన్ని పూర్తి చేయించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే