Tirumala: ఏడు కొండలపై ఐదో చిరుత.. అలిపిరి నడకదారిలో మరో చిరుత సంచారం.
తిరుమలలో చిరుతల సంచారం శ్రీవారి భక్తులను కలవరానికి గురిచేస్తోంది. అలిపిరి కాలినడక మార్గంలో లక్ష్మీనరసింహ ఆలయం దగ్గర చిరుత తిరుగుతున్న దృశ్యాలు ట్రాప్ కెమెరాల్లో నమోదయ్యాయి. ఇటీవల చిరుత దాడికి గురై మరణించిన చిన్నారి లక్షిత మృతదేహం లభ్యమైన ప్రాంతంలోనే చిరుత సంచరించినట్లు అధికారులు తెలిపారు. చిరుత సంచారం శ్రీవారి భక్తులను కలవరానికి గురిచేస్తోంది.
తిరుమలలో చిరుతల సంచారం శ్రీవారి భక్తులను కలవరానికి గురిచేస్తోంది. అలిపిరి కాలినడక మార్గంలో లక్ష్మీనరసింహ ఆలయం దగ్గర చిరుత తిరుగుతున్న దృశ్యాలు ట్రాప్ కెమెరాల్లో నమోదయ్యాయి. ఇటీవల చిరుత దాడికి గురై మరణించిన చిన్నారి లక్షిత మృతదేహం లభ్యమైన ప్రాంతంలోనే చిరుత సంచరించినట్లు అధికారులు తెలిపారు. చిరుత సంచారం శ్రీవారి భక్తులను కలవరానికి గురిచేస్తోంది. ఈ చిరుతను కూడా పట్టుకునేందకు అటవీశాఖ అధికారులు ఆపరేషన్ ప్రారంభించారు. జూన్‌లో ఓ బాలుడిపై చిరుత దాడి చేయగా.. ఆస్పత్రిలో కోలుకున్నాడు.. కొద్ది రోజులకే ఓ చిరుత దొరికింది. ఆ తర్వాత ఆగస్టు 11న నెల్లూరు జిల్లా కోవూరుకు చెందిన చిన్నారి లక్షితను లక్ష్మీ నరసింహస్వామి ఆలయం దగ్గర చిరుత లాక్కెళ్లి చంపిన ఘటన కలకలంరేపింది. ఆ వెంటనే టీటీడీ అధికారులు, అటవీశాఖ ఆధ్వర్యంలో ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు.. బోన్లు తీసుకొచ్చి జూన్ నుంచి ఇప్పటి వరకు నాలుగు చిరుతల్ని బంధించారు. ఇక వాటి బెడద తప్పిందని అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అయినా సరే ట్రాప్ కెమెరాలోను ఆ ప్రాంతాల్లోనే ఉంచారు. తాజాగా మరో చిరుత సంచారం కెమెరాల్లో రికార్డు కావడంతో అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు..
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

