AP News: పగవాడికి కూడా రాకూడదు ఇంతటి కష్టం.. చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని పీక్కు తిన్న కుక్కలు..
మన చుట్టూ సమాజంలో అనేక దారుణాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. అయితే ప్రస్తుతం మనం చెప్పుకునే సంఘటన పగవాడికి కూడా రాకూడదు అనుకునేలా ఉంది. గుర్తుతెలియని వ్యక్తి చనిపోయి మూడు రోజులైనా ఎవరూ గమనించలేదు.. దుర్వాసన వస్తున్నా ఎవరూ పట్టించుకోలేదు. దీంతో వీధి కుక్కలు ఆ మనిషి డెడ్ బాడీని పీక్కుతిన్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం గూలపాళ్యం రైల్వే స్టేషన్ సమీపంలో ఓ వ్యక్తి చనిపోయారు.

మన చుట్టూ సమాజంలో అనేక దారుణాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. అయితే ప్రస్తుతం మనం చెప్పుకునే సంఘటన పగవాడికి కూడా రాకూడదు అనుకునేలా ఉంది. గుర్తుతెలియని వ్యక్తి చనిపోయి మూడు రోజులైనా ఎవరూ గమనించలేదు.. దుర్వాసన వస్తున్నా ఎవరూ పట్టించుకోలేదు. దీంతో వీధి కుక్కలు ఆ మనిషి డెడ్ బాడీని పీక్కుతిన్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం గూలపాళ్యం రైల్వే స్టేషన్ సమీపంలో ఓ వ్యక్తి చనిపోయారు. అతను ఎవరు అన్నది అక్కడున్న స్థానికులకు కూడా తెలియదు. ఆ గుర్తు తెలియని వ్యక్తి చనిపోయి దాదాపు మూడు రోజులు అవుతుంది. రైల్వే స్టేషన్ సమీపంలో డెడ్ బాడీని అటుగా వెళ్తున్న స్థానికులు గుర్తించారు. అయితే స్థానికులు చూసేటప్పటికీ ఒక దారుణమైన సంఘటన కనిపించింది. నిర్జీవంగా పడిఉన్న వ్యక్తి శరీరాన్ని వీధి కుక్కలు పీక్కు తినడాన్ని గుర్తించారు. వాటిని అక్కడి నుంచి తరిమిగొట్టి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
దీంతో పోలీసులు అక్కడికి వచ్చి అతను ఎవరు అనే దానిపై ఆరా తీస్తున్నారు. అయితే మూడు రోజుల నుంచి ఆ డెడ్ బాడీ అక్కడే ఉన్నప్పటికీ ఎవరూ గుర్తించకపోవడం.. అదేవిధంగా చివరకు కుక్కలు పీకుతింటున్న పరిస్థితి వచ్చినా ఎవరూ గమనించకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. మన పక్కన ఉన్న మనుషులు ఏమైపోయినా పర్వాలేదు.. ఎలా ఉన్నా పరవాలేదు.. అసలు ఏం జరుగుతుందో చుట్టుపక్కల ఎవరూ పట్టించుకునే పరిస్థితుల్లో లేరు అని చెప్పడానికి ఈ సంఘటనకు ఉదాహరణ. ఒక మనిషి చనిపోయి మూడు రోజులు అవుతున్నప్పటికీ ఎవరు గమనించకపోవడం.. కనీసం దుర్వాసన వస్తున్నా ఎవరూ పట్టించుకోకపోవడంతో.. చివరికి వీధి కుక్కలు వచ్చి మనిషిని పిక్కు తినే దుస్థితికి చేరుకుంది. ఇలాంటి దయనీయమైన పరిస్థితుల్లో గుర్తించారు స్థానికులు. డెడ్ బాడీని వీధి కుక్కలు పీక్కు తింటున్న సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని.. చనిపోయిన వ్యక్తి ఎవరు అనేదానిపై విచారణ చేపడుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..