AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ugadi 2021: శ్రీశైలంలో మొదలైన ఉగాది మహోత్సవాలు.. సరస్వతి అలంకారంలో అమ్మవారు…

Ugadi 2021 Celebrations in Srisailam: ఆంధ్రప్రదేశ్‏లోని ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైల మల్లికార్జున స్వామివారి ఆలయంలో ఉగాది మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.

Ugadi 2021: శ్రీశైలంలో మొదలైన ఉగాది మహోత్సవాలు.. సరస్వతి అలంకారంలో అమ్మవారు...
Srisailam
Rajitha Chanti
|

Updated on: Apr 12, 2021 | 10:04 AM

Share

Ugadi 2021 Celebrations in Srisailam: ఆంధ్రప్రదేశ్‏లోని ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైల మల్లికార్జున స్వామివారి ఆలయంలో ఉగాది మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈరోజు ఉత్సవాలలో మూడో రోజు. ఈరోజున భ్రమరాంబాదేవిు సరస్వతీ అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. అలాగే సాయంత్రం భ్రమరాంబ, మల్లికార్జున స్వామివార్లకు నందివాహన సేవ నిర్వహిస్తారు. అదేవిధంగా.. ప్రభోత్సవం, వీరాచారి విన్యాసాలు ఉంటాయి. ఈ ఉత్సవాలు ఏప్రిల్ 14న ముగుస్తాయి. ఇక నిన్న ఆదివారం స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి యాగశాలలో చండీశ్వర పూజ, మండపారాధన, జపానుష్ఠానాలు, రుద్రహోమం, పారాయణాలను నిర్వహించారు. ఆదివారం భ్రమరాంబ అమ్మవారు మహాదుర్గ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.

Srisailam 1

Srisailam 1

ఇక రేపు అంటే ఏప్రిల్ 13న ఉగాది పర్వదినాన ఆలయంలో పంచాంగ శ్రావణం ఉంటుంది. మంగళవారం సాయంత్రం స్వామి అమ్మవార్ల రథోత్సవం, అమ్మవారికి రమావాణి సేవిత రాజరాజేశ్వరి అలంకారం చేస్తారు. ఇక తర్వాత రోజు ఏప్రిల్ 14న ఉత్సవాలలో చివరి రోజు కావడంతో స్వామి అమ్మవార్లకు అశ్వవాహన సేవ, భ్రమరాంబదేవి అమ్మవారికి నిజాలంకరణ చేస్తారు. ఈ ఉగాది ఉత్సవాలకు కేవలం తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే కాకుండా.. కర్ణాటక, మహారాష్ట్ర నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తారు. తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేవలం అలంకార దర్శనం మాత్రమే కల్పించనున్నారు. ఎండవేడిని తట్టుకుంటూ స్వామి వార్ల దర్శనానికి కర్ణాటక, మహరాష్ట్రాల భక్తులు కాలినడకన శ్రీశైలానికి చేరుకుంటున్నారు. శ్రీశైల దేవస్థానం అధికారులు మౌలిక వసతులను కల్పించి భరోసా కల్పిస్తున్నారు.

Also Read: బేలూరు చెన్న కేశవ దేవాలయనికి ఎన్ని ప్రత్యేకతలో.. ఆలయ కట్టడం అద్భుతమే.. చూడటానికి రెండు కళ్ళు సరిపోవు..

Horoscope Today: ఈరోజు ఈరాశివారు ఉద్యోగాలు, ఆస్తి విషయాలలో జాగ్రత్తగా ఉండాలి.. ఈరోజు రాశిఫలాలు..

Haridwar Kumbh 2021: హరిద్వార్‌లో పోటెత్తిన భక్తులు.. కనిపించని కోవిడ్ నిబంధనలు.. అధికారుల్లో ఆందోళన