Robbery: ఒంగోలులో రెచ్చిపోయిన దొంగలు.. మూడిళ్లల్లో చోరీ.. భారీగా ఎత్తుకెళ్లిన బంగారం, నగదు.. దొంగల కోసం గాలింపు

Robbery: ఒంగోలులో ఆదివారం రాత్రి దొంగలు రెచ్చిపోయారు. మూడు ఇళ్ళల్లో పక్కా ప్లాన్‌తో చోరీకి పాల్పడ్డారు. ఓ ఇంట్లో 85 వేల నగదుతో పాటు 8 లక్షల విలువైన బంగారు నగలు.

Robbery: ఒంగోలులో రెచ్చిపోయిన దొంగలు.. మూడిళ్లల్లో చోరీ.. భారీగా ఎత్తుకెళ్లిన బంగారం, నగదు.. దొంగల కోసం గాలింపు
Ongole Robbery
Follow us
Subhash Goud

|

Updated on: Apr 12, 2021 | 6:08 AM

Robbery: ఒంగోలులో ఆదివారం రాత్రి దొంగలు రెచ్చిపోయారు. మూడు ఇళ్ళల్లో పక్కా ప్లాన్‌తో చోరీకి పాల్పడ్డారు. ఓ ఇంట్లో 85 వేల నగదుతో పాటు 8 లక్షల విలువైన బంగారు నగలు అపహరించారు. రెండో ఇంట్లో 40 వేల నగదు, మూడో ఇంట్లో 30 వేల నగదు అపహరించారు. అయితే కేవలం గంట వ్యవధిలోనే మూడిళ్ళలో చోరీకి పాల్పడి 10 లక్షల విలువైన నగలు, నగదు అపహరించి పోలీసులకు సవాల్‌ విసిరారు.

నగరంలోని రాజీవ్ నగర్ లోని పవిత్ర కాలేజీ వద్ద ఉన్న మూడు ఇళ్లల్లో దొంగలు రాత్రి 7 గంటల సమయంలో హల్ చల్ చేశారు. రిటైర్డ్ మెడికల్ ఉద్యోగి డేగల నాగలక్ష్మి ఇంటి తలుపులు దగ్గరగా వేసి ఇంటి వద్దనే వాకింగ్ చేస్తుండగా దొంగ ఇంట్లో ప్రవేశించి బీరువాలోని 25 సవర్ల బంగారు నగలు మరియు 85 వేల రూపాయల నగదు అపహరించారు…

చోరీ జరిగిన ఇంటికి వెనక వైపు ఉన్న మరో రెండిళ్ళలో తాళాలు వేసి ఉండడంతో వాటిని పగలగొట్టి ఒక ఇంట్లో 30 వేల నగదు, మరో ఇంట్లో 40 వేల రూపాయలు దొంగిలించుకుపోయారు. నగరంలో కేవలం గంట వ్యవధిలో మూడిళ్ళలో చోరీ జరిగాయి. వెంటనే బాధితులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. చోరీ జరిగిన తీరును పరిశీలించారు. సమీపంలోని సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో పడ్డారు. సాయంత్రం సమయంలో జనం అందరూ మేలుకుని ఉండగానే దొంగలు మూడిళ్ళ్లల్లో వరుస చోరీలకు పాల్పడటం నగరంలో కలకలం రేపింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దొంగల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.

ఇవీ చదవండి: ఉగాది పండగ కోసమని స్వగ్రామానికి వెళ్తూ అనంత లోకాలకు… రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి

Police attack : పోలీసుల దాష్టీకం, వృత్తిధర్మం, మానవత్వం మరిచి కరోనా పేషంట్‌, కుటుంబ సభ్యులపై వికృత చేష్టలు