ఉగాది పండగ కోసమని స్వగ్రామానికి వెళ్తూ అనంత లోకాలకు… రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
Road Accident ఉగాది పండగ సందర్భంగా సంతోషంగా కుటుంబ సభ్యులతో జరుపుకొందామనుకున్న వీరికి మృత్యువు వెంటాడింది. పండగకోసం కారులో స్వగ్రామానికి వెళ్తుంగా, బొలెరో...
Road Accident ఉగాది పండగ సందర్భంగా సంతోషంగా కుటుంబ సభ్యులతో జరుపుకొందామనుకున్న వీరికి మృత్యువు వెంటాడింది. పండగకోసం కారులో స్వగ్రామానికి వెళ్తుంగా, బొలెరో వాహనం ఢీకొట్టడంతో ముగ్గురు మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన జోగుళాంబ గద్వాల్ జిల్లా ఇటిక్యాల మండలం పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల మండలం ఎర్రపల్లకు చెందిన మురళీమోహన్‌రెడ్డి (456) కొన్నేళ్లుగా హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో నివాసం ఉంటూ వ్యాపారం చేస్తున్నాడు. ఈయన భార్య సుజాత (41), కుమార్తె ఏహారెడ్డి (12), కుమారుడు సాయితేజారెడ్డిలు ఉన్నారు. ఉగాది పండగ కోసమని కారులో స్వగ్రామానికి బయలుదేరారు. జోగుళాంబ గద్వాల జిల్లా ఇటీక్యాల మండలం ధర్మవరం స్టేజీ సమీపంలోకి రాగానే హైవేపై ముందు వెళ్తున్న లారీ ఓవర్‌టెక్ చేయబోయాడు. దీంతో కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడుతూ అనంతపురం నుంచి హైదరాబాద్ వెళ్తున్న బొలెరోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రెండు వాహనాలు నుజ్జు నుజ్జు కాగా, ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.
వీరిని స్థానికులు చికిత్స నిమిత్తం అంబులెన్స్‌లో కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యంలో మురళీ మోహన్ రెడ్డి, భార్య సుజాత, కుమార్తె నేహారెడ్డిలు మృతి చెందారు. ప్రస్తుతం కుమారుడు సాయితేజారెడ్డితో పాటు బొలెరోలో ప్రయాణిస్తున్న సునీల్, రాజు, సత్యంలు చికిత్స పొందుతున్నారు. ఘటన స్థలాన్ని సందర్శించిన కోదండాపురం ఎస్సై కృష్ణయ్య పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్న జరుపుతున్నారు. కారు అతివేగమే కారణమని పోలీసులు తెలిపారు.
ఇవీ చదవండి: Miraculously Video: భూమి మీద నూకలున్నాయి అంటే ఇదేనేమో.. బైక్ ఢీ కొట్టినా బతికాడు