రెండు పాముల మధ్య భీకర పోరు.. ఒళ్లు గగుర్పాటుకు గురి చేసిన ఘటన..!

వన్యప్రాణులకు, సరీసృపాలకు సంబంధించిన అనేక భీకర పూరులు టీవీల్లోనూ సోషల్ మీడియాలోనూ మీరు చూసే ఉంటారు, అయితే గంటల తరబడి రెండు పాముల మధ్య గొడవ మన కళ్ల ముందే కనిపిస్తే, అదే జరిగింది మన ఆంధ్రప్రదేశ్‌ విజయనగరం జిల్లాలో..!

రెండు పాముల మధ్య భీకర పోరు.. ఒళ్లు గగుర్పాటుకు గురి చేసిన ఘటన..!
King Cobra
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: Sep 20, 2024 | 9:05 PM

వన్యప్రాణులకు, సరీసృపాలకు సంబంధించిన అనేక భీకర పూరులు టీవీల్లోనూ సోషల్ మీడియాలోనూ మీరు చూసే ఉంటారు, అయితే గంటల తరబడి రెండు పాముల మధ్య గొడవ మన కళ్ల ముందే కనిపిస్తే, అదే జరిగింది మన ఆంధ్రప్రదేశ్‌ విజయనగరం జిల్లాలో..!

పార్వతీపురం మండలం జిల్లా సాలూరు మండలం చిన్న వూటగెడ్డలో కింగ్ కోబ్రా హల్చల్ చేసింది. సుమారు పద్దెనిమిది అడుగుల పొడవు ఉన్న కింగ్ కోబ్రా ప్రక్కనే ఉన్న కొండ ప్రాంతం నుండి గ్రామంలోకి ప్రవేశించింది. అలా వచ్చిన కింగ్ కోబ్రా గ్రామంలోని వీధులన్నీ కలియతిరిగింది. కొద్దిసేపటి తర్వాత పెద్ద పెద్దగా బుసలు కొట్టడం ప్రారంభించింది. అలా గ్రామస్తుల చెవిన పడిన కింగ్ కోబ్రా బుసల శబ్దాలు ఎక్కడ నుండి వస్తున్నాయో అని అంతా వెదికారు. ఇంతలో భయంకరమైన రూపంతో నల్లగీతలతో పెద్ద పెద్ద శబ్దాలు చేసుకుంటూ వారి మీదకు పరుగు పరుగున పాకుకుంటూ వచ్చింది. ఆ పామును చూసిన గ్రామస్తులు భయంతో పరుగులు తీశారు. ఇళ్లలోకి వెళ్లి తలుపులు గడియ పెట్టుకున్నారు.

ఆ తర్వాత కొద్ది సేపటికి గ్రామం నుండి కింగ్ కోబ్రా వెళ్ళిపోయి ఉంటుందని ఊహించుకున్న గ్రామస్తులు ఒక్కొక్కరిగా ఇంట్లో నుండి బయటకు రావటం ప్రారంభించారు. ఇంతలో అదే గ్రామంలో ఒక వీధిలో ఉన్న ట్రాక్టర్ పై బుసలు కొడుతూ కనిపించింది. అయితే అక్కడ నుండి కింగ్ కోబ్రాతో పాటు మరొక నల్ల త్రాచు పాము కూడా బసలు కొడుతూ కనిపించింది. అలా రెండు పాముల బుసల శబ్దాలతో ఆ ప్రాంతమంతా భయానకంగా మారింది.

అయితే కింగ్ కోబ్రా ట్రాక్టర్‌లో ఉన్న నల్లత్రాచు పామును మింగటానికి ప్రయత్నిస్తుంది. నల్లత్రాచు కింగ్ కోబ్రా నుండి తప్పించుకునే ప్రయత్నం చేసింది. అలా రెండు పాముల మధ్య భీకర పోరు కొనసాగింది. చివరికి నల్లత్రాచు కింగ్ కోబ్రా ధాటికి తట్టుకోలేక చివరికి కింగ్ కోబ్రాకు ఆహారంగా మారింది. అలా కింగ్ కోబ్రా నల్లత్రాచును మింగేసింది. సుమారు పద్దెనిమిది అడుగులు ఉన్న కింగ్ కోబ్రా ఆరు అడుగులు పొడవున్న నల్ల త్రాచును మింగింది. దీంతో కింగ్ కోబ్రా కదలని పరిస్థితిలోకి వెళ్లిపోయింది.

ఇదంతా గమనించిన గ్రామస్తులు కింగ్ కోబ్రాను ఇలాగే వదిలేస్తే గ్రామస్తులకు సైతం హాని తలపెడుతుందని గ్రహించి, కర్రలతో దాడి చేసి కింగ్ కోబ్రాను చంపేశారు. అలా కింగ్ కోబ్రా చనిపోవడంతో గ్రామస్తులంతా ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం కింగ్ కోబ్రా ను కొట్టి చంపడం అరిష్టమని పలువురు గ్రామ పెద్దలు చెప్పడంతో వెంటనే మృతి చెందిన కింగ్ కోబ్రా కు ప్రత్యేక పూజలు చేసి ఊరి బయట పూడ్చి పెట్టి తమ గ్రామాన్ని కాపాడాలని వేడుకున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..