Ghosts: తూర్పుగోదావరి జిల్లాలో జంట దెయ్యాల హల్‌చల్‌.. వైరల్‌ అవుతున్న సీసీటీవీ పుటేజీ..!

Ghosts: దెయ్యం, భూతాల గురించి ప్రస్తావన తీసుకురాగానే అమ్మో దెయ్యాలా.. అని చాలా మంది భయపడతారు. దెయ్యల పేరు తీసుకువస్తేనే వణికిపోతుంటారు...

Ghosts: తూర్పుగోదావరి జిల్లాలో జంట దెయ్యాల హల్‌చల్‌.. వైరల్‌ అవుతున్న సీసీటీవీ పుటేజీ..!
Follow us

|

Updated on: Dec 26, 2021 | 9:51 PM

Ghosts: దెయ్యం, భూతాల గురించి ప్రస్తావన తీసుకురాగానే అమ్మో దెయ్యాలా.. అని చాలా మంది భయపడతారు. దెయ్యల పేరు తీసుకువస్తేనే వణికిపోతుంటారు. దెయ్యలు ఉన్నాయని వినడం, వీడియోల్లో చూడడం తప్ప నేరుగా చూసిందేమి ఉండదు. కొందరికి దెయ్యం ఎలా ఉంటుందో తెలుసుకోవాలనే ఉత్సాహం కూడా ఉంటుంది. ఇక తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి మెయిన్ రోడ్డు ప్రముఖ నగల షాప్‌లో దెయ్యం హల్ చల్.. అంటూ వదంతులు రావడంతో… బంగారు నగలు షాపు యజమాని మొబైల్‌లో సీసీ కెమెరా ఆన్ చేయగా రెండు దెయ్యాలు కొట్టుకుంటునట్లు కనిపించే దృశ్యాలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. దీంతో స్థానికంగా భయాందోళన నెలకొంది.

రాజమండ్రి మెయిన్ రోడ్‌లో ఉన్న స్థానిక గుండు వారి వీధిలో ఓ బంగారు నగలు షాప్‌లో అరుపులు, కేకలు తరచూ వినిపించడంతో నగల వ్యాపారి లోపల ఉన్న కెమెరాలను చెక్ చేసి చూడుగా రెండు దెయ్యాలు తెల్లటి ఆకారంలో ఉన్నట్లు గుర్తించారు. మొదట లోపలకి వెళ్లేందుకు బయపడగా మొబైల్‌లో సీసీ కెమెరాల ఆధారంగా జంట దెయ్యాల దోబూచులాట చూసి అవాక్కయ్యారు. నిజంగా షాడోలో కలిసి గొడవ పడుతున్న ఆకారాలు దెయ్యలా ఉన్నా నమ్మలేకపొతున్నారు. మరి అవి నిజంగానే దెయ్యాలా? లేక ఇంకా ఏదయినా ఆకారాల అని తెలియాల్సి ఉంది. ఈ సీసీ టీవీ పుటేజీ కలకలం రేపుతోంది.

దెయ్యాలపై నమ్మకాలు.. దెయ్యం చనిపోయిన వ్యక్తిని పోలినవి. దెయ్యాలు వాటికి సంబంధించిన, చనిపోయిన ప్రదేశాలలో కనిపిస్తాయని భావిస్తుంటారు. దెయ్యాలు చనిపోయిన వ్యక్తుల ఆత్మలకు సంబంధించినవిగా కూడా కొందరు భావిస్తుంటారు. ఇవి ఎక్కువగా కనిపించే ప్రదేశాల్ని హాంటెడ్ (Haunted) ప్రదేశాలు అంటారు. ఇవి కొన్ని వస్తువుల్ని ప్రేరేపిస్తాయి.. కానీ ఇలాంటివి ఎక్కువగా యువతులలో కనిపించే మానసిక ప్రవృత్తికి సంబంధిచిన విషయాలుగా కొందరు భావిస్తారు.

అయితే దెయ్యాలు ఉన్నది లేనిదీ చాలా సంధిగ్ధంగా ఉన్నాయి. ఇవి ఉన్నాయని నమ్మేవాళ్ళు, నమ్మనివాళ్ళూ ప్రపంచమంతా ఉన్నారు. దెయ్యాల గురించి ప్రాచీనకాలం నుంచి నమ్మకాలు బలంగా నాటుకున్నాయి. అయితే 19వ శతాబ్దంలో మానసిక శాస్త్ర పరిశోధనలు కూడా జరిగాయి. దీనికి సంబంధించిన భూత వైద్యులు దెయ్యాల్ని వదిలించడానికి ప్రయత్నించి సఫలీకృతులయ్యారు. హేతువాదులు దెయ్యాల ఉనికిని నమ్మరు. కొన్ని కారణం తెలియని విషయాలకు దెయ్యాలుగా ప్రచారం చేస్తారని వీరు భావిస్తారు. అయితే ప్రపంచవ్యాప్తంగా రెండింటికీ కూడా బలమైన నిరుపణలు లేవు. అమెరికాలో 2005 సంవత్సరంలో జరిపిన సర్వే ప్రకారం.. సుమారు 32 శాతంమంది దెయ్యాలు ఉన్నాయని నమ్మారు. ఇలా దెయ్యాల గురించి చాలా మంది రకరకాలుగా మాట్లాడుకుంటారు. కానీ ఎవ్వరి నమ్మకం వారిది. కొందరు దెయ్యాలు ఉండవంటుంటే.. కొందరేమో దెయ్యాలు ఉన్నాయంటూ నమ్ముతుంటారు.

ఇవి కూడా చదవండి:

Omicron Variant: ఒమిక్రాన్‌ వేరియంట్‌ విషయంలో చైనా వ్యూహం పని చేయదు.. కీలక ట్విట్‌ చేసిన దక్షిణాఫ్రికా వైరాలజిస్ట్‌

CJI NV Ramana: ప్రభుత్వాలు న్యాయ వ్యవస్థపై నిర్లక్ష్యంతో ఉన్నాయి: సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి