TV9 Conclave: ఏపీ, తెలంగాణను పురుగును చూసినట్లు చూస్తున్నారు.. నేతలు నోరెత్తరే.. చలసాని ఆవేదన..
కాంగ్రెస్‌ను నమ్మి మోసపోతే... బీజేపీ నమ్మించి మోసం చేసిందని చలసాని శ్రీనివాసరావు అన్నారు. ఏపీకి ద్రోహం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ నేతలు కేంద్రానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంటే... ఏపీలో ఆ పరిస్థితి కనిపించడం లేదని మండిపడ్డారు. ప్రత్యేక హోదా, విభజన హామీల విషయంలో ఒక్క అడుగు ముందుకు పడటం లేదని మండిపడ్డారు..

కాంగ్రెస్‌ను నమ్మి మోసపోతే… బీజేపీ నమ్మించి మోసం చేసిందని చలసాని శ్రీనివాసరావు అన్నారు. ఏపీకి ద్రోహం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ నేతలు కేంద్రానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంటే… ఏపీలో ఆ పరిస్థితి కనిపించడం లేదని మండిపడ్డారు. ప్రత్యేక హోదా, విభజన హామీల విషయంలో ఒక్క అడుగు ముందుకు పడటం లేదని మండిపడ్డారు చలసాని శ్రీనివాసరావు. తెలంగాణకు ఒక్క నేషనల్ ప్రాజెక్టు ఇవ్వలేదని.. ఏపీకి ఇచ్చిన ప్రాజెక్టులను పక్కన పెట్టేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగు జాతి కలిసి పోరాడాల్సిన సమయం వచ్చిందన్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి తెలంగాణ సమాజం మద్దతు ఇస్తుందని.. సింగరేణి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తాము పోరాటం చేస్తామన్నారు చలసాని శ్రీనివాసరావు. సీఎం జగన్, చంద్రబాబు, పవన్ ఢిల్లీ పెద్దల దగ్గర తల తాకట్టు పెట్టారని చలసాని శ్రీనివాసరావు ఆరోపించారు. ఏపీలో వామపక్షాలు, కాంగ్రెస్ పోరాటం చేస్తున్నా… వాటి బలం సరిపోవడం లేదని అభిప్రాయపడ్డారు.
కేంద్ర ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని చలసాని శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. జలాల పంపకంపై అభ్యంతరం వ్యక్తం చేస్తే.. ఏపీ, తెలంగాణకు వ్యతిరేకంగా కేంద్రం సుప్రీం కోర్టులో అఫిడవిట్ వేసిందని మండిపడ్డారు. ఉమ్మడి ఆస్తుల వివాదాన్ని వెంటనే పరిష్కరించుకోవాలని సూచించారు. పార్లమెంట్‌లో తెలుగు ప్రజలకు అవమానం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు చలసాని శ్రీనివాసరావు. ఏపీ, తెలంగాణను బీజేపీ ప్రభుత్వం పురుగును చూసినట్లు చూస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.



