Andhra Pradesh: ప్రత్యేక హోదా అంశం ముగిసిపోలేదు.. బొత్స సత్యనారాయణ
2014లో ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయిన అనంతరం.. ఏపీ ప్రజలు తమకు ప్రత్యేక హోదా కావలంటూ పెద్ద ఎత్తున నిరసనలు చేశాయి. అయినప్పటికీ ఆ ఆశలు నెరవేరలేదు. అయితే తాజాగా ఈ అంశంపై పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు.

2014లో ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయిన అనంతరం.. ఏపీ ప్రజలు తమకు ప్రత్యేక హోదా కావలంటూ పెద్ద ఎత్తున నిరసనలు చేశాయి. అయినప్పటికీ ఆ ఆశలు నెరవేరలేదు. అయితే తాజాగా ఈ అంశంపై పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. ప్రత్యేక హోదాను అటుకెక్కించి దించిన సందర్భాలు లేవని చెప్పారు. ప్రత్యేక హోదా ముగిసిపోయిన అంశం కాదని పేర్కొన్నారు. విభజన చట్టంలో చాలావరకు హామీలు నెరవేర్చలేదని తెలిపారు.
కమిటీ నివేదిక ప్రకారం రాజధానిని ఏర్పాటు చేయలేదని.. టీడీపీ ప్రభుత్వం తమ స్వలాభం కోసమే అమరావతిని రాజధానిగా చేయాలనుకుందని చెప్పారు. గత ప్రభుత్వం తప్పిదం వల్లే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బంది పడుతోందన్నారు. అయినప్పటికీ కూడా గత ఐదేళ్లలతో పోల్చేకుంటే రాష్ట్ర తలసరి ఆదాయం పెరిగిందన్నారు. వ్యవసాయ రంగంలో ఆరు శాతం వృద్ధి సాధించామని చెప్పారు. అలాగే గతంలో ఏపీ అక్షరాస్యతలో 24వ స్థానంలో ఉండేదని ఇప్పుడు మూడో స్థానానికి వచ్చిందని పేర్కొన్నారు.



