Big News Big Debate: సంచలనం రేపుతోన్న బాబు అరెస్ట్ అంశం.. బిగ్ న్యూస్ బిగ్ డిబేట్
తప్పు చేసినవాళ్లకే భయం ఉంటుందని.. చంద్రబాబు అక్రమాలకు పాల్పడితే ఖచ్చితంగా అరెస్టు ఉంటుందని ప్రభుత్వం చెబుతోంది. ఇన్‌ఫ్రా కంపెనీల నుంచి లంచాలు తీసుకున్న చంద్రబాబు... స్కిల్ డెవలప్‌మెంట్ స్కీమ్‌లోనూ స్కాములకు పాల్పడ్డారంటోంది వైపీపీ. ప్రతి అంశంలో చంద్రబాబును మద్దతు ఇస్తున్న లెఫ్ట్, జనసేన, బీజేపీలు నోటీసులపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నిస్తున్నారు వైసీపీ నాయకులు. అటు టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్టు చేస్తారన్నది ప్రచారమేనని..
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం సంచలన రేపుతున్న అంశం చంద్రబాబు నాయుడు అరెస్ట్. ఆయనే స్వయంగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అధికారపార్టీకి అస్త్రంగా మారాయి. సానుభూతి కోసం చంద్రబాబు గేమ్స్ ఆడుతున్నారని.. తప్పు చేసి ఉంటే చట్టం తన పనితాను చేసుకుపోతుందని వైసీపీ అంటోంది. అయితే దేనికైనా సిద్ధమేనంటోంది తెలుగుదేశం పార్టీ. రేపోమాపో తనను అరెస్టు చేస్తారని, లేకుంటే దాడి చేస్తారని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపాయి. 118 కోట్ల రూపాయల లెక్కచూపని ఆదాయం వ్యవహారంలో ఐటీ నోటీసులు అందుకున్న చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై రాష్ట్రంలో చర్చనీయాంశం అయింది. ఇదే అంశంలో సీఐడీ కూడా రంగంలో దిగుతుందన్న వార్తల మరింత ఉత్కంఠ రేపుతున్నాయి.
తప్పు చేసినవాళ్లకే భయం ఉంటుందని.. చంద్రబాబు అక్రమాలకు పాల్పడితే ఖచ్చితంగా అరెస్టు ఉంటుందని ప్రభుత్వం చెబుతోంది. ఇన్‌ఫ్రా కంపెనీల నుంచి లంచాలు తీసుకున్న చంద్రబాబు… స్కిల్ డెవలప్‌మెంట్ స్కీమ్‌లోనూ స్కాములకు పాల్పడ్డారంటోంది వైపీపీ. ప్రతి అంశంలో చంద్రబాబును మద్దతు ఇస్తున్న లెఫ్ట్, జనసేన, బీజేపీలు నోటీసులపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నిస్తున్నారు వైసీపీ నాయకులు. అటు టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్టు చేస్తారన్నది ప్రచారమేనని.. అలాంటి అవకాశమే లేదంటున్నారు బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్. ఇక రాష్ట్రంలో అరాచక పాలనను ప్రశ్నించిన వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారాయన. మొత్తానికి చంద్రబాబు నిజంగానే అరెస్టుకు భయపడుతున్నారా? వైసీపీ మైండ్‌గేమ్ ఆడుతుందా? కేంద్రం ఇచ్చిన నోటీసులపై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఆరా తీస్తోంది?
ఇదే అంశంపై టీవీ9 తెలుగు బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ వీడియో..
ఏపీలో హాట్ హాట్‌గా రాజకీయాలు..
ఏపీలో రాజకీయాలు హాట్ హాట్‌గా నడుస్తున్నాయి. అనంతపురం నుంచి ఉభయగోదావరి జిల్లాల వరకూ కేడర్ మధ్య వీధియుద్ధాలు జరుగుతున్నాయి. అటు నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ప్రశ్నించేవారిపై అధికారపార్టీయే దాడులకు ఊసిగొల్పుతుందని చంద్రబాబు ఆరోపించారు. పైగా తమ కార్యకర్తలపై కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. అటు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేకుండా పోయిందని.. ప్రతిపక్షాలపై ప్రభుత్వమే దాడులు చేయిస్తుందన్నారు జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్.
గతంలో పవన్ కల్యాణ్ యాత్రను అడ్డుకున్నారని, ఇప్పుడు టీడీపీ యువగళంపైనా అదే తరహా దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్య పరిరక్షణకు అంతా కలిసిరావాలని పిలుపునిచ్చారు. అవినీతికి పాల్పడిన చంద్రబాబుకు నోటీసులు వస్తే మిగిలిన పార్టీలు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు వైసీపీ నేతలు. యాత్రల పేరుతో విపక్ష నేతలు రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తూ విద్వేషాలు నింపుతున్నారని అధికారపార్టీ ఆరోపిస్తోంది.
ఇదే అంశంపై టీవీ9 తెలుగు బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ వీడియో..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..