TTD Darshan Tickets: శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. దర్శనం టికెట్లు విడుదల..

TTD Special Darshan Tickets: తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని ఎదురు చూస్తున్న భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం

TTD Darshan Tickets: శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. దర్శనం టికెట్లు విడుదల..
Ttd
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jan 28, 2022 | 9:38 AM

TTD Special Darshan Tickets: తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని ఎదురు చూస్తున్న భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త చెప్పింది. ఫిబ్రవరి నెలకు సంబంధించి రూ.300 ల శ్రీవారి దర్శన టికెట్ల (Darshan Tickets) ను శుక్రవారం ( జనవరి 28న) ఉదయం 9 గంటలకు టీటీడీ (TTD) ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. ఈ ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు, శనివారం ఉదయం 9 గంటలకు టైం స్లాట్‌ సర్వదర్శన టోకెన్లను కూడా అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. రోజుకు 12 వేల చొప్పున టికెట్ల చొప్పున టీటీడీ  అందుబాటులో ఉంచింది. అంతేకాకుండా రేపటినుంచి ఇక రోజుకు 10 వేల చొప్పున సర్వదర్శనం (Special Darshan Tickets) టోకెన్లను కూడా ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు.

కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో పరిమితంగానే శ్రీవారి దర్శన టికెట్లను విడుదల చేస్తున్నట్లు టీటీడీ ప్రకటనలో తెలిపింది. కాగా.. ఈ టికెట్లను టీటీడీ అధికారిక వెబ్‌సైట్లో మాత్రమే పొందవచ్చని.. ఆఫ్‌లైన్లో సేవలు లేవని తెలిపింది. స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులు కరోనా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, ప్రతిఒక్కరూ మాస్క్ ధరించాలని తిరుమల తిరుపతి దేవస్థానం స్పష్టం చేసింది. భక్తులు tirupatibalaji.ap.gov.in ద్వారా టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. టికెట్లను బుక్ చేసుకున్న భక్తులు తప్పకుండా కోవిడ్ వ్యాక్సినేషన్, నెగిటివ్ సర్టిఫికెట్ తీసుకురావాలని సూచించింది.

టికెట్లను ఇలా బుక్ చేసుకోండి..

టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌లో లాగిన్ కావాలి

అనంతరం టికెట్ల కోటాకు సంబంధించిన లింక్‌పై క్లిక్ చేయాలి

వివరాలను నమోదు చేసి టికెట్లను బుక్ చేసుకోవాలి..

టికెట్ల బుకింగ్ కోసం నేరుగా ఈ లింకును క్లిక్ చేయండి..

Also Read:

Andhra Pradesh: జిన్నా ఇప్పుడే ఎందుకు గుర్తొచ్చాడో.. బీజేపీ నేతలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన వైసీపీ ఎంపీ..

KTR: పట్టణ ప్రజల కోసం ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టాలి.. కేంద్రానికి మంత్రి కేటీఆర్ లేఖ

ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?
ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?
కొత్త ఫీచర్లతో హోండా యూనికార్న్.. అప్‌డేట్ మోడల్ విడుదల
కొత్త ఫీచర్లతో హోండా యూనికార్న్.. అప్‌డేట్ మోడల్ విడుదల
బిచ్చగత్తె చేతిలో అనుమానాస్పద ప్లాస్టిక్ బ్యాగ్.. తెరిచి చూడగా
బిచ్చగత్తె చేతిలో అనుమానాస్పద ప్లాస్టిక్ బ్యాగ్.. తెరిచి చూడగా
హైడ్రాకు ఇప్పటివరకు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో తెలుసా..?
హైడ్రాకు ఇప్పటివరకు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో తెలుసా..?
బక్కగా ఉన్నవారు బరువు పెరగాలంటే ఇలా చేయండి..
బక్కగా ఉన్నవారు బరువు పెరగాలంటే ఇలా చేయండి..
వివాదాలు పరిష్కరించుకునేందుకు ఐటీ శాఖ న్యూ స్కీమ్..!
వివాదాలు పరిష్కరించుకునేందుకు ఐటీ శాఖ న్యూ స్కీమ్..!
మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
నితీశ్ కుమార్‌ రెడ్డికి ఏపీ ప్రభుత్వం భారీ నజరానా
నితీశ్ కుమార్‌ రెడ్డికి ఏపీ ప్రభుత్వం భారీ నజరానా
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..