YV Subba Reddy: వారి ఆశీస్సులతోనే రెండోసారి బాధ్యతలు స్వీకరించా: టీటీడీ చైర్మెన్ వైవీ సుబ్బారెడ్డి
TTD Chairman YV Subba Reddy: వెంకటేశ్వర స్వామి, అమ్మవారి ఆశీస్సులతో రెండోసారి టీటీడీ చైర్మెన్‌గా బాధ్యతలు స్వీకరించానని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి

TTD Chairman YV Subba Reddy: వెంకటేశ్వర స్వామి, అమ్మవారి ఆశీస్సులతో రెండోసారి టీటీడీ చైర్మెన్‌గా బాధ్యతలు స్వీకరించానని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. తనకు మళ్లీ స్వామివారి సేవ చేసుకునే అవకాశం ఇచ్చినందుకు ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. మంగళవారం ఉదయం టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు విజయవాడ ఇంద్రకీలాద్రిపైనున్న దుర్గమ్మను దర్శించుకున్నారు. వైవీ సుబ్బారెడ్డి దంపతులకు ఆలయ చైర్మన్ సోమినాయుడు, ఈవో భ్రమరాంబ పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం వైవీ సుబ్బారెడ్డి దంపతులు.. ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు.
దుర్గా అమ్మవారి ఆశీస్సులు, వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో రెండోసారి టీటీడీ చైర్మెన్ గా బాధ్యతలు స్వీకరించినట్లు సుబ్బారెడ్డి తెలిపారు. తనకు స్వామి వారి సేవ చేసుకునే అవకాశం ఇచ్చినందుకు సీఎం జగన్‌కు ధన్యవాదాలంటూ పేర్కొన్నారు. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు, కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులు ఎల్లప్పుడూ ప్రజలపై ఉండాలని పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు సకాలంలో ప్రజలకు చేరాలని కోరుకున్నట్లు సుబ్బారెడ్డి తెలిపారు. ప్రజలు కలకాలం సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని, కలియుగ దైవం అయిన వెంకటేశ్వరస్వామిని కోరుకున్నానని సుబ్బారెడ్డి తెలిపారు. ఆయన వెంట పలువును వైఎస్ఆర్‌సీపీ నాయకులు, ఆలయ అధికారులు, సిబ్బంది ఉన్నారు.
Also Read:
