AP Lightning Alert: ఏపీలోని ఆ రెండు జిల్లాలకు పిడుగు హెచ్చరిక.. పూర్తి వివరాలు
ఆంధ్రప్రదేశ్‌లోని రెండు జిల్లాల పరిధిలోని పలు మండలాల పరిసరాల్లో పిడుగులు పడే అవకాశాలు ఉధృతంగా ఉన్నట్లు విపత్తుల శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

Andhra Pradesh Lightning Alert: ఆంధప్రదేశ్‌లో రెండు జిల్లాల పరిధిలోని పలు మండలాల్లో ఇవాళ(ఆగస్టు 10) పిడుగు పడే అవకాశముంది. ఏపీలోని తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లోని పలు మండలాల్లో పిడుగు పడే అవకాశమున్నట్లు ఆ రాష్ట్ర విపత్తుల శాఖ పిడుగు హెచ్చరిక జారీ చేసింది. పిడుగు పడే అవకాశం ఉధృతంగా ఉన్న మండలాల పరిసర ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
తూర్పుగోదావరి జిల్లా:
రాజమండ్రి రూరల్, కడియం, కొత్తపేట, ఆత్రేయపురం ,రావులపాలెం, ఆలమూరు, మండపేట, కపీలేశ్వరపురం, కాజులూరు, తాళ్లచెరువు, కాట్రేనికోన, ఐ.పోలవరం, అయినవల్లి, పామర్రు, రామచంద్రాపురం.
పశ్చిమగోదావరి జిల్లా:
నల్లజేర్ల, తాడేపల్లిగూడెం, కొయ్యలగూడెం, దేవరపల్లి, చాగల్లు, నిడదవోలు, పెంటపాడు, తణుకు, ఉండ్రాజవరం, పేరవల్లి, ఇరగవరం, అత్తిలి, పెనుమంట్ర, ఉంగుటారు ఈ మండలాల పరిసర ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉధృతంగా ఉందని ఏపీ విపత్తుల శాఖ కమిషనర్ కె.కన్నబాబు ఓ ప్రకటనలో తెలిపారు.

Lightning Strikes
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..
ఆ మండలాల్లోని ప్రజలు పిడుగుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పిడుగుల పడే సమయాల్లో పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కులీలు, పశు-గొర్రెల కాపరులు చెట్ల క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండొద్దని సూచించారు. పిడుగులు పడే సమయంలో.. సురక్షితమైన భవనాల్లో ఆశ్రయంపొందాలని విపత్తుల శాఖ కమిషనర్ కె.కన్నబాబు ప్రకటన జారీ చేశారు.
Also Read..
అవినీతి ఆరోపణలపై ప్రమాణానికి సిద్ధమైన విష్ణు.. సవాళ్లు, ప్రతిసవాళ్లతో కాణిపాకంలో హైటెన్షన్
బొమ్మ తుపాకీతో దొంగతనానికి భారీ ప్లాన్.. కట్ చేస్తే.. చివరకు ఇలా చిక్కాడు..
