AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weather: ఇదేమైనా దండయాత్ర..! ఒక్కసారే గ్లోబ్‌ను చుట్టుముట్టిన తుఫాన్లు

ప్రపంచంపై తుఫాన్ల దండయాత్ర జరుగుతోందా..? ఒకటి కాదు రెండు కాదు, ఇప్పుడు గ్లోబ్‌పై మూడు భారీ తుఫాన్ల ముప్పు పొంచి ఉంది. మన బంగాళాఖాతంలో మొంథా, పసిఫిక్ మహాసముద్రంలో సోనియా, అట్లాంటిక్ మహాసముద్రంలో మెలీషా తుఫాన్లు తీర ప్రాంతాలను వణికిస్తున్నాయి. ఇప్పటికే మొంథా ప్రభావం మన ఏపీపై తీవ్రంగా కనిపిస్తోంది. మరి మిగతా వాటి ప్రభావం ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం...

Weather: ఇదేమైనా దండయాత్ర..! ఒక్కసారే గ్లోబ్‌ను చుట్టుముట్టిన తుఫాన్లు
Storms
Ram Naramaneni
|

Updated on: Oct 28, 2025 | 10:24 PM

Share

పైన ఫోటోలో మీరు చూస్తున్నారు కదా నాలుగు సర్కిల్స్ కనిపిస్తున్నాయి. అరేబియా సముద్రంలో కనిపిస్తున్న సర్కిల్‌లో ఉన్నది అల్పపీడనం. ఇది తీర ప్రాంతాలపై పెద్దగా ఎఫెక్ట్‌ లేదు. ఇక మిగతా మూడు చాలా ముఖ్యమైనవి. బంగాళాఖాతంలో ఏర్పడింది మొంథా. దీని ప్రభావం ఇప్పటికే ఏపీ తీర ప్రాంతంపై పడింది. మరికాసేపట్లోనే కాకినాడ-మచిలీపట్నం తీరం తాకనుంది. ఇక జమైకా తీరప్రాంతం అట్లాంటిక్ మహాసముద్రంలో మెలీషా ఏర్పడింది. ఇక చివరిది పపిఫిక్ మహాసముద్రంలో ఏర్పడింది సోనియా. ఇది మన మొంథా తుఫాన్‌లాగే తీవ్రమైంది కానీ తీరం తాకదు. సముద్రంలో బలహీనపడుతుందని వాతావరణశాఖ చెబుతోంది. .

ఈమూడు తుఫాన్ల ప్రభావం ఎలా ఉంటుందో పాయింట్ ఇప్పుడు తెలుసుకుందాం..

‘మొంథా’ : కాకినాడ-మచిలీపట్నం మధ్య తీరం దాటనుంది. గాలుల వేగం గంటకు 100కి.మీ ఉంటుంది. ఈ ప్రచండ గాలులకు ఇళ్లు, చెట్లు కూలిపోవచ్చు. విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలగనుంది. పోర్టులకు ఇప్పటికే 10వ నెంబర్ హెచ్చరిక జారీ అయింది. కాకినాడ, విశాఖలో షిప్పింగ్ క్లోజ్ అయింది. ఈ తుఫాన్ కారణంగా వందల కోట్లు ఆర్థిక నష్టం వాటిల్లనుంది. ఒడిశా, ఆంధ్రలో 3 రోజులు స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. పర్వత ప్రాంతాల్లో ల్యాండ్‌స్లైడ్‌లు జరుగుతున్నాయి. తీర ప్రాంతాలు అతలాకుతలం అవుతున్నాయి.

ఇక మరో ప్రమాదకరమైన తుఫాన్ మెలీషా విషయానికి వస్తే… ఇది మొంథాకన్నా మూడింతలు ఎక్కువ ప్రభావం చూపనుంది. ఇంకా తీరం దాటలేదు. తీరం దాటే సమయంలో మాత్రం భారీ విధ్వంసమేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అట్లాంటిక్ మహాసముద్రంలో ఈ హరికేన్ విధ్వంసం కొనసాగుతుంది.  జమైకా వైపు 17కి.మీ/గం వేగంతో ప్రయాణిస్తుంది. జమైకా, క్యూబా, బహామాస్‌పై తీవ్ర ప్రభావం చూపనుంది. ఫ్లాష్‌ఫ్లడ్స్‌తో జనజీవనం అస్తవ్యస్తం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే 8మంది మృతి, పలుగ్రామాల్లో అంధకారంలో చిక్కుకున్నాయి. జమైకా తీరంలో భారీ విధ్వంసం తప్పదని హెచ్చరికలు వస్తున్నాయి. 280 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. 75సెం.మీ వర్షం కురుస్తుందని అంచనా.  ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సర్వనాశనం అవ్వనుంది. జమైకా తీరప్రాంతం మొత్తం మునిగే చాన్స్ ఉంది. మెలీషా విధ్వంసం తలచుకుంటేనే స్థానికులు వణికిపోతున్నారు.

ఇక మూడో తుఫాన్ సోనియా.. పసిఫిక్ మహాసముద్రంలో పుట్టింది ఈ తుఫాన్. గాలి వేగం 72 కి.మీ/గంటకుగా ఉంది. సముద్రంలో మాత్రమే ప్రభావం చూపనుంది.  భారీ వర్షాలు, నష్టాలు లేవు.  ఓపెన్ వాటర్స్‌లో షిప్పింగ్‌కు మాత్రమే హెచ్చరిక. కోస్టల్ డ్యామేజ్ జీరో. సముద్రంలోనే బలహీనపడే అవకాశం

ఇలా గ్లోబ్‌పై ఒకే రేఖవెంబడి మూడు తీవ్ర తుఫాన్‌లు పుట్టాయి. ప్రస్తుతం మొంథా తీరాన్ని తాకినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ల్యాండ్‌ ఫాల్ ప్రక్రియ ప్రారంభమైంది. మరో 3-4గంటలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.