కానిస్టేబుల్‌పై ఎస్ఐల ప్రతాపం..
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో పోలీసులు ఒకరిపై ఒకరు దాడి చేసుకుని.. సోషల్ మీడియాకు ఎక్కారు. ఓ కానిస్టేబుల్‌ను నలుగురు ఎస్‌ఐలు దారుణంగా చితకబాదారు. మంగళవారం రాత్రి టూటౌన్ పీఎస్ పరిధిలోని బసవయ్యపాళ్యం చెరువు వద్ద స్నేహితులతో కలిసి మద్యం సేవించాడు కానిస్టేబుల్ అనిల్ కుమార్. మద్యం పార్టీ అయిపోయిన తర్వాత తిరిగి ఇంటికి వస్తుండగా అనిల్‌ను ఆపాడు ట్రైనీ ఎస్ఐ ఓబులేశు. వివరాలు చెబుతుండగానే కానిస్టేబుల్‌పై దాడి చేశాడు. తాను టూటౌన్ పీఎస్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్నానని […]
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో పోలీసులు ఒకరిపై ఒకరు దాడి చేసుకుని.. సోషల్ మీడియాకు ఎక్కారు. ఓ కానిస్టేబుల్‌ను నలుగురు ఎస్‌ఐలు దారుణంగా చితకబాదారు. మంగళవారం రాత్రి టూటౌన్ పీఎస్ పరిధిలోని బసవయ్యపాళ్యం చెరువు వద్ద స్నేహితులతో కలిసి మద్యం సేవించాడు కానిస్టేబుల్ అనిల్ కుమార్.
మద్యం పార్టీ అయిపోయిన తర్వాత తిరిగి ఇంటికి వస్తుండగా అనిల్‌ను ఆపాడు ట్రైనీ ఎస్ఐ ఓబులేశు. వివరాలు చెబుతుండగానే కానిస్టేబుల్‌పై దాడి చేశాడు. తాను టూటౌన్ పీఎస్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్నానని చెప్పినా.. ఎస్ఐ ఓబులేశు వినిపించుకోలేదని బాధితుడు తెలిపాడు.
దెబ్బలకు తట్టుకోలేక కానిస్టేబుల్ అనిల్ కూడా తిరగబడ్డాడు. దీంతో అక్కడి నుంచి వెళ్లిపోయిన ఓబులేశు మరో ముగ్గురు ఎస్‌ఐలను వెంటబెట్టుకుని వచ్చాడు. ఈసారి నలుగురూ కలిసి కానిస్టేబుల్ అనిల్‌పై విచక్షణారహితంగా దాడిచేశారు.
బాధితుడి బంధువులు కాళహస్తి టూటౌన్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. తనపై దాడి జరిగిన విషయాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేశాడు కానిస్టేబుల్ అనిల్. అదికాస్తా వైరల్‌గా మారడంతో విషయం తిరుపతి అర్బన్ ఎస్పీకి చేరింది. దీంతో విచారణకు ఆదేశించారు ఎస్పీ.