ఎగిరెళ్లి పడ్డా.. బతికిన యువతి, యువకుడు

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌పై వెళ్తున్నవారిని వెనుక నుంచి ఓ కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో యువకుడు ఎగిరి దూరంగా పడగా.., యువతి కారు ముందు భాగంలో ఇరుక్కుపోయింది. బెంగుళూరు-చెన్నై జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. మంగళవారం ఉదయం జరిగిన ఈ ప్రమాద ద‌ృశ్యాలు అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. కారు కింద ఇరుక్కుపోయిన యువతిని బయటికి తీసి ఆస్పత్రికి తరలించారు అక్కడున్న స్థానికులు. అయితే.. ఈ ప్రమాదంలో ఇద్దరూ […]

ఎగిరెళ్లి పడ్డా.. బతికిన యువతి, యువకుడు
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Apr 03, 2019 | 11:36 AM

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌పై వెళ్తున్నవారిని వెనుక నుంచి ఓ కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో యువకుడు ఎగిరి దూరంగా పడగా.., యువతి కారు ముందు భాగంలో ఇరుక్కుపోయింది.

బెంగుళూరు-చెన్నై జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. మంగళవారం ఉదయం జరిగిన ఈ ప్రమాద ద‌ృశ్యాలు అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. కారు కింద ఇరుక్కుపోయిన యువతిని బయటికి తీసి ఆస్పత్రికి తరలించారు అక్కడున్న స్థానికులు.

అయితే.. ఈ ప్రమాదంలో ఇద్దరూ ప్రాణాలతో బయటపడ్డారు. కారు వేగంగా ఢీకొట్టినా.., ఇద్దరికీ స్వల్ప గాయాలే కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదానికి గురైన వారు గంగవరం మండలం మర్రిమాకులపల్లికి చెందిన వారిగా గుర్తించారు.