విశాఖలో హవాలా క్యాష్ రాకెట్ ముఠా గుట్టురట్టు
విశాఖలో హవాలా రాకెట్ ముఠా గుట్టురట్టు చేశారు సిటీ టాస్క్ ఫోర్స్ పోలీసులు. ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి.. వారి నుంచి ఏకంగా 38 లక్షల 76 వేల 350 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు క్యాష్ కౌంటింగ్ మిషన్, ఫ్యాక్స్ మిషన్లు సీజ్ చేశారు. పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండకు చెందిన చలుమూరి రామకృష్ణ, విశాఖ సిటీకి చెందిన చల్లా నారాయణరావు ఇద్దరూ కలిసి హవాలా బిజినెస్ ప్రారంభించారు. విశాఖ సిటీ ద్వారాకా నగర్‌లోని […]
విశాఖలో హవాలా రాకెట్ ముఠా గుట్టురట్టు చేశారు సిటీ టాస్క్ ఫోర్స్ పోలీసులు. ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి.. వారి నుంచి ఏకంగా 38 లక్షల 76 వేల 350 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు క్యాష్ కౌంటింగ్ మిషన్, ఫ్యాక్స్ మిషన్లు సీజ్ చేశారు.
పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండకు చెందిన చలుమూరి రామకృష్ణ, విశాఖ సిటీకి చెందిన చల్లా నారాయణరావు ఇద్దరూ కలిసి హవాలా బిజినెస్ ప్రారంభించారు. విశాఖ సిటీ ద్వారాకా నగర్‌లోని వనితా రెసిడెన్సీలో ఫ్లాట్ అద్దెకు తీసుకుని కార్యకలాపాలు నిర్వహించేవారు.
అయితే.. సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు వనిత రెసిడెన్సీ ఫ్లాట్‌లోని హవాలా బిజినెస్ సెంటర్‌పై దాడి చేసి సోదాలు నిర్వహించారు. దీంతో.. నగదుతో పాటు రెడ్ హ్యాండెడ్‌గా నిందితులను పట్టుకున్నారు పోలీసులు. వీరిద్దరిపై కేసులు నమోదు చేసి, అదుపులోకి తీసుకున్నారు. అయితే.. ఇది రాజకీయ పార్టీలకు సంబంధించిన ఎన్నికల నగదా..? లేదా..? అనే దానిపై పోలీసులు ఇన్వెస్ట్‌గేషన్ చేస్తున్నారు.