చంద్రబాబుపై జగన్ తీవ్ర విమర్శలు
ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు నెల్లూరులో పర్యటించారు. అక్కడ ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. నెల్లూరులో తాగు, సాగు నీరు అందించే బ్యారేజీ పనులను వైయస్సార్ చేపట్టి, దాదాపు సగం పనులు పూర్తి చేసినా కూడా వాటిని ఇవాల్టికి పూర్తి చెయ్యకపోవడం చంద్రబాబు డొల్లతనానికి నిదర్శనమని జగన్ అన్నారు. పేదల నుంచి దోచుకోవడానికి కూడా టీడీపీ నేతలు వెనకాడరని ఎద్దేవా చేశారు. ఇంతలా ప్రజలను పీడిస్తున్న చంద్రబాబు […]
ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు నెల్లూరులో పర్యటించారు. అక్కడ ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. నెల్లూరులో తాగు, సాగు నీరు అందించే బ్యారేజీ పనులను వైయస్సార్ చేపట్టి, దాదాపు సగం పనులు పూర్తి చేసినా కూడా వాటిని ఇవాల్టికి పూర్తి చెయ్యకపోవడం చంద్రబాబు డొల్లతనానికి నిదర్శనమని జగన్ అన్నారు. పేదల నుంచి దోచుకోవడానికి కూడా టీడీపీ నేతలు వెనకాడరని ఎద్దేవా చేశారు. ఇంతలా ప్రజలను పీడిస్తున్న చంద్రబాబు గారిని సీఎం అనాలా.. లేక రాక్షసుడు అనాలా అంటూ జగన్ ధ్వజమెత్తారు.
నెల్లూరులోని ప్రభుత్వ విద్యాసంస్థల్ని చంద్రబాబు నిర్లక్ష్యం చేస్తున్నారని, అందుకు కారణం నారాయణ విద్యాసంస్థల్లో ఆయన బినామీ అని ఆరోపించారు. ఎంతో మంది పేద విద్యార్థుల జీవితాలతో నారాయణ కాలేజీ యాజమాన్యం ఆడుకుందని జగన్ అన్నారు. నాన్నని నమ్మి ఓటేస్తే ..ఆయన మీకు సుపరిపాలనను అందించారు. అలాగే నాకు ఒక్క అవకాశం ఇవ్వండి.. నాన్నగారి కన్నా మెరుగైన పాలన అందిస్తాను. చనిపోయిన తర్వాత ప్రతి ఇంట్లో మా నాన్న ఫోటో పక్కన నా ఫోటో కూడా ఉండేలా.. పాలన సాగిస్తానని జగన్ ప్రజలకు తెలిపారు. చేసిన అభివృద్ది గురించి చెప్పకుండా, కట్టిన సింగపూర్ లాంటి రాజధానిని చూపించకుండా ప్రతిపక్షంపై పడి ఏడవడం చంద్రబాబుకు సిగ్గుగా అనిపించడం లేదా అని ఆయన ప్రశ్నించారు. చివరి నాలుగు నెలల్లో ప్రజలను మభ్యపెడుతున్నారని..అవి కూడా నవరత్నాల్లో నుంచి దొంగిలించిన మూడు రత్నాలను వాడుకుని కాదా అంటూ జగన్ ప్రశ్నాస్త్రాలు సంధించారు