విశాఖ జిల్లా అరకులో రాళ్ల వాన
విశాఖ జిల్లా అరకులో రాళ్లవాన దంచికొట్టింది. గత రెండు, మూడు రోజులుగా రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. దీంతో.. క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి అక్కడక్కడా వర్షాలు కురుస్తున్నాయి. అరకులో వాతావరణం ఒక్కసారిగా చల్లబడి వర్షం కురిసింది. రాళ్ల వాన దంచికొట్టడంతో రోడ్లపై మంచు గడ్డలు గుట్టులుగుట్టలుగా పేరుకుపోయాయి. ఈడ్చికొడుతున్న వడగళ్ల వానతో స్థానికులు ఇళ్లలోకి పరుగులు తీశారు. మరికొంతమంది మాత్రం మంచుగడ్డలను పట్టుకుని ఎంజాయ్ చేశారు.